విధాత : జర్నలిస్టుల సంక్షేమానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల నెలవారీ పెన్షన్‌ను గణనీయంగా పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు.
పదవీ విరమణ పొందిన జర్నలిస్టుల నెలవారీ పెన్షన్‌ను రూ.12,000 నుండి రూ.15,000కు పెంచారు.మరణించిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు (ఆధారపడిన వారికి) ఇచ్చే కుటుంబ పెన్షన్‌ను రూ. 6,000 నుండి రూ. 7,500కు పెంచారు. గుర్తింపు కార్డులు (Accredited Identity Cards) కలిగిన జర్నలిస్టులందరినీ ‘ముఖ్యమంత్రి సమగ్ర వైద్య బీమా పథకం’ పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన ఒక సహకార గృహ నిర్మాణ సంఘం ద్వారా, చెంగల్పట్టు జిల్లాలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలను కేటాయించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయంలో సీఎం స్టాలిన్ తో చెన్నై ప్రెస్ క్లబ్ ప్రతినిధుల సమావేశం అనంతరం ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి :
కోకాపేటకు మించి హయత్ నగర్ వైపు అభివృద్ది : మంత్రి వెంకట్ రెడ్డి
దారుణం..పెళ్లికి నిరాకరించిన యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్!
