Kia Sonet 2026 | 10 లక్షల్లోపే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ SUV.. 2026 కియా సోనెట్ కొత్త వేరియంట్లు వచ్చేశాయి!

Kia Sonet 2026 | భారత మార్కెట్‌లో ఉన్న డిమాండ్ మేరకు కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయిన కియా ఇండియా సోనెట్ 2026 మోడల్‌కు కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది.

Kia Sonet 2026 | భారత మార్కెట్‌లో ఉన్న డిమాండ్ మేరకు కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయిన కియా ఇండియా సోనెట్ 2026 మోడల్‌కు కొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. మిడ్ రేంజ్ వేరియంట్లలోని డీజిల్, టర్బో-పెట్రోల్ ఇంజిన్లలో ఇప్పుడు కొత్త ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పైగా రూ.10 లక్షల కంటే తక్కువ ధరలోనే వస్తుండటంతో చౌక ధరలో కొత్తగా కారు కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటివరకు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్న వేరియంట్లు ఎక్కువ ధరలో ఉన్న HTX వేరియంట్ నుంచే అందుబాటులో ఉండేది. ఆ వేరియంట్ ధర సుమారు రూ.13.35 లక్షల వరకు ఉండేది. అయితే ఇప్పుడు కియా ఈ డీజిల్ ఆటోమేటిక్ ఎంపికను HTD(o) వేరియంట్ నుంచే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఈ ఆటోమేటిక్ వేరియంట్ కొనాలని అనుకునేవారికి సుమారు రూ.3.56 లక్షల వరకు ఆదా అవుతుంది.

అదేవిధంగా టర్బో పెట్రోల్ డీసీటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా ముందుగా HTX వేరియంట్ నుంచే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఈ గేర్ బాక్స్‌ను HTX(o) వేరియంట్ నుంచే అందుబాటులోకి తీసుకురావడంతో దీని ధర సుమారు రూ.2.63 లక్షల వరకు తగ్గింది. ఇక 2026 సోనెట్‌లో కొత్త కలర్ వేరియంట్‌ను కూడా తీసుకొచ్చారు. ఇక భారత మార్కెట్‌లో సోనెట్ రూ.7.30 లక్షలు (ఎక్స్ షోరూం ధర)తో అందుబాటులో ుంది.

కొత్తగా తీసుకొచ్చిన మాగ్నా రెడ్ కలర్‌తో పాటు ఇప్పటికే ఉన్న ఇంపీరియల్ బ్లూ, ప్యూటర్ ఆలివ్, గ్లేసియర్ వైట్, స్పార్క్‌లింగ్ సిల్వర్, అరోరా బ్లాక్, గ్రేటివ్ గ్రే కలర్లు కూడా అందుబాటులో ఉంటాయి. వీటిలో గ్లేసియర్ వైట్ కలర్‌ను బ్లాక్ రూఫ్‌తో డ్యుయెల్ టోన్ రూపంలో కూడా ఎంచుకునే ఆప్షన్ ఇచ్చారు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ అప్‌డేట్‌లో కొత్తగా ఎటువంటి ఫీచర్‌ను జోడించలేదు. అయితే ఇప్పటికే ఉన్న ప్రీమియం ఫీచర్లను మాత్రం కొనసాగిస్తోంది.

ప్రధాన ఫీచర్లు

సేఫ్టీ ఫీచర్ల విషయంలోనూ సోనెట్ మంచి ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా, ఏబీఎస్‌తో పాటు ఈబీడీ, ముందు & వెనుక పార్కింగ్ సెన్సర్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, లెవల్ 1 ఏడీఏఎస్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

ఇంజిన్ ఆప్షన్లలో కియా సోనెట్ ఎలాంటి మార్పులను చేయలేదు. గతంలో మాదిరిగానే సోనెట్‌ మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లతో కొనసాగుతోంది. 1.2లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 83 పీఎస్, 115ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 120 పీఎస్ పవర్, 172 ఎన్ఎం టార్క్ ఇస్తుంది. ఇది 6 స్పీడ్ ఐెంటీ లేదా 7 స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ ట్రాన్‌మిషన్‌తో అందుబాటులో ఉంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 116పీఎస్ పవర్, 250ఎన్‌ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్‌తో లభిస్తుంది.

భారత మార్కెట్‌లో కియా సోనెట్ SUV ప్రధానంగా హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సన్, మహీంద్రా XUV 300 వంటి మోడళ్లతో పోటీ పడుతుంది. అయితే కొత్త వేరియంట్లతో పాటు తక్కువ ధరలోనే ఆటోమేటిక్ ఎంపికలతో 2026 కియా సోనెట్ మార్కెట్‌లో మరింత గట్టి పోటీగా నిలబడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Latest News