Site icon vidhaatha

‘శాకుంతలం’ లో అల్లు అర్హ

విధాత :ఇండస్ట్రీలో తొలి సినిమా ఎంతో ప్రత్యేకం. కెరీర్‌కు పునాది వేసే మొదటి సినిమాకు ఎంతో ఇంపార్టెన్స్‌ ఇస్తారు సెలబ్రిటీలు. అంతేకాదు, వెండితెరపై వారి పిల్లల ఎంట్రీ కూడా ఘనంగా ఉండేలా చూసుకుంటారు. అందుకు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా అతీతం కాదు. తన గారాలపట్టి అర్హ సినీ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌ చేశాడు. అది కూడా బడా హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శాకుంతలం’ సినిమా ద్వారా ఆమెను నటిగా ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. అయితే తన క్యూట్‌, స్వీట్‌, అల్లరి చేష్టలతో అర్హ ఈపాటికే తెలుగు ప్రేక్షకులను తన బుట్టలో వేసుకుంది. మరి ఇప్పుడు ఏకంగా నటించే చాన్స్‌ వచ్చిందంటే జనాలను ఏ రేంజ్‌లో అలరిస్తుందో చూడాలంటున్నారు అభిమానులు.

తన కూతురి సినీ ఎంట్రీ సమంత సినిమా ద్వారా జరుగుతుండంపై హర్షం వ్యక్తం చేశాడు బన్నీ. ‘సమంతతో వైవిధ్యమైన జర్నీ కొనసాగించాను. ఆమె సినిమా ద్వారా అల్లు అర్హ నటిగా పరిచయం అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. శాకుంతలం సినిమా టీమ్‌కు ఇవే నా అభినందనలు’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక అల్లువారి చిట్టితల్లి బిగ్‌స్క్రీన్‌పై సందడి చేయబోతుందని తెలిసిన అభిమానులు సోషల్‌ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. సమంత, అర్హను ఒకే స్క్రీన్‌ మీద చూడబోతున్నామని తెగ ఎగ్జైట్‌ అవుతున్నారు.

Exit mobile version