పుష్ప‌లో అల్లు అర్జున్ మేన‌రిజం శ్రీహ‌రి నుండి కాపీ కొట్టారా.. ఇన్నాళ్ల‌కి బ‌య‌టికొచ్చిన సీక్రెట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని గ్లోబ‌ల్ స్టార్ చేసింది పుష్ప చిత్రం అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో గంధ‌పు చెక్క‌ల నేప‌థ్యంలో తెరకెక్కిన పుష్ప సినిమా పెద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ మాత్రం ప్రేక్ష‌కుల‌కి పిచ్చెక్కించాయి. బ‌న్నీ మేనరిజం, త‌గ్గేదేలే అనే డైలాగ్, భుజాన్ని పైకెత్తి న‌డ‌వ‌డం వంటి వాటిని ప్ర‌తి ఒక్క‌రు ఫాలో అయ్యారు. క్రికెట‌ర్స్ సైతం పుష్ప‌లో బ‌న్నీ చేసిన‌ట్టు రీల్స్ చేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో పుష్ప సినిమాకి మ‌రింత ఆద‌ర‌ణ ద‌క్కింది.పుష్ప సినిమాకి రీచ్ ఎక్కువ కావ‌డం, సినిమా మరింత మంచి హిట్ కావ‌డంతో ఇప్పుడు `పుష్ప2`ని వేరే లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్నాడు దర్శకుడు సుకుమార్. లేటైన స‌రే క్వాలిటీ విష‌యంలో ఏ మాత్రం రాజీప‌డ‌డం లేదు.

  • Publish Date - April 1, 2024 / 07:20 AM IST

అయితే తాజాగా పుష్ప సినిమాకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. చిత్రంలో బన్నీ భుజం పైకెత్తే మ్యానరిజానికి మంచి ఆద‌ర‌ణ ద‌క్క‌గా, దానిని శ్రీహ‌రి నుండి కాపీ కొట్టారంటూ ఇప్పుడు కొత్త వాద‌న తెర‌పైకి తెస్తున్నారు. 20 ఏళ్ల క్రితం పి.వాసు దర్శకత్వంలో వచ్చిన పృథ్వీ నారాయణ మూవీలో శ్రీహరి డ్యూయెల్‌ రోల్‌ పోషించాడు. పృథ్వీ, నారాయణ అనే పాత్రల్లో మెరిశాడు. ఒకటి హీరో పాత్ర కాగా, రెండోది విలన్‌ పాత్ర. పృథ్వీ పోలీస్ గా క‌నిపించగా, నారాయణ విలన్ పాత్ర‌. అయితే నారాయణ పాత్ర సినిమా మధ్యలో ఎంట్రీ ఇస్తుంది. తన ఫ్యామిలీకి, తనకు ద్రోహం చేసిన వారిపై పగతీర్చుకునేందుకు విదేశాల నుండి వ‌స్తాడు.

అయితే ఆయ‌న భుజం పైకి ఎత్తి న‌డుస్తుండ‌డం అప్ప‌ట్లోనే అల‌రించింది. మ్యాన‌రిజాన్ని స‌హ‌జంగా పండిస్తూ పాత్ర‌ని ఎంత‌గానో రక్తిక‌ట్టించాడు శ్రీహ‌రి. హీరో పాత్ర క‌న్నా కూడా విల‌న్ పాత్ర‌కే మంచి పేరు వచ్చింది. అయితే ఇదే మేన‌రిజాన్ని సుకుమార్ పుష్ప కోసం వాడాడు అని టాక్ వినిపిస్తుంది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో శ్రీహ‌రి వీడియోలు , స్క్రీన్ షాట్స్ షేర్ చేస్తూ పుష్ప‌లో దీని నుండే కాపీ కొట్టారంటూ ట్రోల్ చేస్తున్నారు. మ‌రి సుకుమార్ నిజంగా శ్రీహ‌రిని చూసి కాపీ కొట్టాడా లేక సొంత ఆలోచ‌న‌తో అలా డిజైన్ చేశాడా అనేది మాత్రం తెలియ‌దు. ప్ర‌స్తుతం దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద రచ్చ అవుతుండటం గమనార్హం.

Latest News