Site icon vidhaatha

Allu Arjun| మెగా వాట్స‌ప్ గ్రూప్ నుండి ఎగ్జిట్ అయిన బ‌న్నీ.. ఇంకా పొలిటిక‌ల్ వార్ చ‌ల్లార‌లేదా?

Allu Arjun| మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో గొడ‌వ‌లు ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌ణిగేలా క‌నిపించ‌డం లేదు. గ‌త కొద్ది రోజుల నుండి అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తుంద‌ని ప్ర‌చారాలు జ‌రిగాయి కాని ఇటీవ‌ల మాత్రం అది నిజ‌మేన‌ని నిరూపిత‌మైంది. అల్లు అర్జున్ నంద్యాల నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న తన ఫ్రెండ్ రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఇంటి వెళ్లి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంతో నిప్పు రాజుకుంది. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న ట్విట్ట‌ర్‌లో ప్రత్యర్థులకు పనిచేసేవాడు మనవాడైనా పరాయివాడే అవుతాడు.. పరాయివాడై ఉండి మనతో పనిచేస్తుంటే మనవాడే అవుతాడు.. అంటూ నాగబాబు పేర్కొన్నారు. ఈ కామెంట్ అల్లు అర్జున్‌ని ఉద్దేశించే చేశాడ‌ని అనేక వార్త‌లు వ‌చ్చాయి.

అయితే దీనిపై నాగ‌బాబు కూడా ఏం స్పందించ‌క‌పోవ‌డంతో అది నిజ‌మేన‌ని న‌మ్మారు. అయితే నాగ‌బాబు చేసిన ట్వీట్‌కి కౌంట‌ర్‌గా అల్లు అర్జున్ పేరుతో అకౌంట్ నుంచి ఒక మెసేజ్ రెండు రోజుల నుంచి వైర‌ల్ అయింది. మా తాత లేకపోతే బాపట్లలో సైకిల్ షాపులో పంక్చర్లు వేసుకునేవాడివంటూ అందులో ఉంది. ఇక బ‌న్నీ ఫ్యాన్స్ అయితే నాగ‌బాబుని ఓ రేంజ్‌లో ఆడుకోవ‌డంతో అకౌంట్ డీయాక్టివేట్ చేశాడు. ఇక త‌ర్వాత మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చి ట్వీట్ డిలీట్ చేశాన‌ని అన్నాడు. దీంతో అయిన వివాదాలకి పులిస్టాప్ ప‌డుతుందా అని అంద‌రు భావించారు. కాని ఇది ఇప్ప‌ట్లో చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు.

మెగా కుటుంబంలోని హీరోలు, ఇతర కుటుంబ సభ్యులందరికీ కలిపి ఓ వాట్సాప్ గ్రూప్ ఉంద‌ట‌. అందులో వారంద‌రు స‌ర‌దాగా ముచ్చ‌టించుకుంటూ ఉంటార‌ట‌. ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌రు క‌మ్యునికేట్ అవుతూ త‌మ‌కి సంబంధించిన విష‌యాలు షేర్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఈ వాట్సాప్ గ్రూప్ నుండి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయిన‌ట్టు స‌మాచారం. దీంతో బ‌న్నీ మెగా ఫ్యామిలీకి మ‌రింత దూరం అయ్యాడ‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. అల్లు అరవింద్ అటూ బ‌న్నీకి చెప్పలేక, ఇటూ మెగా ఫ్యామిలీకి చెప్పలేక లోలోప‌ల‌ సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. మ‌రి ఈ గొడ‌వ‌లు ఇంకెన్నాళ్లు కంటిన్యూ అవుతాయో చూడాలి.

Exit mobile version