Site icon vidhaatha

Allu Arjun| ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి నా మ‌ద్ద‌తు అంటూ వైసీపీ లీడ‌ర్ త‌ర‌పున‌ బ‌న్నీ ప్ర‌చారం చేయబోతున్నాడా..!

Allu Arjun|  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎంత ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయో మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు ప్ర‌చారానికి చివ‌రి రోజు కావ‌డంతో ప్ర‌ముఖులు ఆయా పార్టీల‌కి జోరుగా ప్ర‌చారం చేసే ప‌నిలో ఉన్నారు. ఓవైపు వైసీపీ, మరోవైపు తెలుగుదేశం – జనసేన పార్టీ – భారతీయ జనతా పార్టీ కూటమిలు పెద్ద ఎత్తున ప్రచారాలలో దూసుకుపోతున్నాయి. ఇక పలువురు సినీ సెల‌బ్రిటీలు సైతం ప్ర‌చారాల‌లో పాల్గొంటూ ఆస‌క్తి రేపుతున్నారు. సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఇండ‌స్ట్రీ నుండి భారీ మ‌ద్ద‌తు లభిస్తుంది. ఇటీవలే న్యాచురల్ స్టార్ నాని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు త‌న స‌పోర్ట్ అందిస్తున్న‌ట్టు తెలియ‌జేశారు.

ఇక మెగా ఫ్యామిలీ హీరోలు అయితే ఏకంగా పిఠాపురంకి వెళ్లి ప్ర‌చారం చేశారు. ఇక చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌వ‌న్‌కి త‌మ స‌పోర్ట్ తెలియ‌జేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పవన్ కల్యాణ్ పై అదిరిపోయే ట్వీట్ చేస్తూ త‌న పూర్తి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్టు తెలియ‌జేశారు. ఈ ప్రయాణంలో మీరు అనుకున్నది సాధించాలి.. సేవ చేయాలని, సేవకే అంకితం చేయాలని ఎంచుకున్న ఈ మార్గం చూసి నేను ఎప్పుడు గ‌ర్వ‌ప‌డుతుంటాను. ఓ కుటుంబ స‌భ్యుడిగా మీతో ఉంటాను. అలానే మీరు అనుకున్న‌ది సాధించాల‌ని కోరుకుంటున్నాను అని బ‌న్నీ తెలిపారు. ప్రచారంలో పాల్గొనకపోయినప్పటికీ.. తన సపోర్ట్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఉంటుంద‌ని బ‌న్నీ తెలప‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు.

అయితే ప‌వ‌న్‌కి మ‌ద్ద‌తు తెలిపిన అల్లు అర్జున్ ఇప్పుడు వైసీపీ అభ్య‌ర్ధి త‌ర‌పున ప్ర‌చారం చేసేందుకు నంద్యాల వెళుతున్నార‌ట‌. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు.. అల్లు అర్జున్ శనివారం ఉదయం నంద్యాలకు బ‌య‌లు దేరిన‌ట్టు స‌మాచారం. అక్క‌డ ఫ్రెండ్ త‌ర‌పున ప్ర‌చారం కూడా చేస్తార‌ని టాక్ న‌డుస్తుంది. అయితే త‌న స్నేహితుడి కోసం బ‌న్నీ తీసుకున్న ఈ నిర్ణ‌యం ప‌ట్ల రవిచంద్ర కిషోర్ రెడ్డి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version