Allu Arjun-Warner|ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెట్ క్రీడాకారుడు డేవిడ్ వార్నర్ (David Warner) తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. ఆయన ఎక్కువగా తెలుగు పాటలకి రీల్స్ చేస్తూ అలరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో వార్నర్‌కి విపరీతమైన పాపులారిటీ పెరిగింది.ఈ దిగ్గజ క్రికెటర్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఐపీఎల్ తో పాటు పలు లీగ్ లలో మాత్రం ఆడతానని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ కి ఎన్నో ఏళ్లు ఆడిన వార్నర్ ఎక్కువగా బన్నీ పాటలకి సంబంధించి రీల్స్ చేస్తూ డ్యాన్స్‌లు చేసేవాడు. అంతేకాదు సెంచరీ చేసినా ..హాఫ్ సెంచరీ తో అలరించిన ప్రతిసారి కూడా వార్నర్ తగ్గేదేలే అన్నట్టుగా గడ్డం కిందికి చెయ్యి పోనివ్వడాన్ని మనం ఎన్నోసార్లు చూశాము.
పుష్పకి ఇంటర్నేషనల్ క్రేజు రావడానికి వార్నర్ కారణమనే చెప్పాలి.ఆయన పుష్ప పాటలకి తెగ రీల్స్ చేశారు. అయితే ఈ రోజు డేవిడ్ వార్నర్ బర్త్ డే కాగా, ఆయనకి విషెస్‍ను తెలుపుతూ ఇన్‍స్టాగ్రామ్‍లో స్టోరీ పోస్ట్ చేశారు అల్లు అర్జున్(Allu Arjun). పుష్ప తగ్గేదెలే మూవ్‍మెంట్‍ను వార్నర్ చేస్తున్న ఫొటోను పోస్ట్ చేసి విష్ చేశారు. ఇలాంటి పుట్టిన రోజులు చాలాచాలా జరుపుకోవాలి.. మై డియర్ బ్రదర్ అంటూ అల్లు అర్జున్.. వార్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్ విషెస్‍కు వార్నర్ రియాక్ట్ అయ్యారు. థాంక్స్ బ్రదర్ అంటూ తన ఇన్‍స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. దీంతో అల్లు అర్జున్, డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు
అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. సుకుమార్(Sukumar) దర్శకత్వంలో తెనకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా, శ్రద్ధా కపూర్ ఐటమ్ సాంగ్ చేస్తుంది. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న ఈ సినిమా కోసం అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ అన్నీ కూడా సినిమాపై అంచనాలను ఓ రేంజ్‌లో పెంచేశాయి.. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.