Anand Mahindra| నాగ్ అశ్విన్ ధైర్యానికి గ‌ర్వ‌ప‌డుతున్నాను.. ఆనంద్ మ‌హీంద్రా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Anand Mahindra| కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో పెద్ద సినిమాల హ‌డావిడి క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో జెట్ స్పీడ్‌తో దూసుకొస్తుంది క‌ల్కి కల్కి 2898 ఏడీ. జూన్ 27న రిలీజ్ కానున్న ఈ సినిమాని వీక్షించేందుకు ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవ‌ల బుజ్జి పేరుతో చిత్ర యూనిట్ తెగ ప్ర‌చారాలు చేస్తుంది. బుజ్జి అనేది సినిమాలో ప్ర‌భాస్ వాడే వాహ‌నం కాగా, దీని లాంచింగ్ కోసం ఏకంగా పెద్ద ఫంక్ష‌న్ ఏర్పాటు చేశారు మేక‌ర్స్. ఆ ఈవెం

  • Publish Date - May 24, 2024 / 04:51 PM IST

Anand Mahindra| కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో పెద్ద సినిమాల హ‌డావిడి క‌నిపించ‌డం లేదు. ఈ క్ర‌మంలో జెట్ స్పీడ్‌తో దూసుకొస్తుంది క‌ల్కి కల్కి 2898 ఏడీ. జూన్ 27న రిలీజ్ కానున్న ఈ సినిమాని వీక్షించేందుకు ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవ‌ల బుజ్జి పేరుతో చిత్ర యూనిట్ తెగ ప్ర‌చారాలు చేస్తుంది. బుజ్జి అనేది సినిమాలో ప్ర‌భాస్ వాడే వాహ‌నం కాగా, దీని లాంచింగ్ కోసం ఏకంగా పెద్ద ఫంక్ష‌న్ ఏర్పాటు చేశారు మేక‌ర్స్. ఆ ఈవెంట్‌లో ప్ర‌భాస్ స్వ‌యంగా బుజ్జి వాహ‌నాన్ని న‌డుపుకుంటూ వ‌చ్చి అందరికి షాక్ ఇచ్చాడు. అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగిస్తూ త‌యారు చేసిన ఈ కారులో ఫీచర్స్ అద్భుతం. దాదాపు 7 కోట్ల రూపాయ‌ల‌తో ఈ వాహ‌నాన్ని త‌యారు చేసిన‌ట్టు తెలుస్తుంది.

అయితే బుజ్జి త‌యారీ కోసం ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్రా కూడా సాయం చేసిన‌ట్టు స‌మాచారం. ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో మహీంద్రా రీసెర్చ్ వ్యాలీకి చెందిన చెన్నై బృందం `కల్కి` టీమ్‌కు వారి `ఫ్యూచరిస్టిక్ వెహికల్ కోసం విజన్ – బుజ్జి`ని రూపొందించ‌డానికి సాయం చేశారు అని రాసుకొచ్చారు. కోయంబత్తూర్‌కు చెందిన జయమ్ మోటార్స్ రోబోట్ కారు డిజైన్‌ని త‌యారు చేసి, వెనుక గోళాకార చక్రానికి శక్తినిచ్చే రెండు మహీంద్రా ఇ-మోటార్‌లని అమ‌ర్చిన‌ట్టు తెలిపారు. చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలోని మా బృందం పవర్‌ట్రెయిన్ కాన్ఫిగరేషన్, ఆర్కిటెక్చర్ .. అలాగే కార్ పనితీరును అనుకరించడం ద్వారా ఫ్యూచరిస్టిక్ వాహనం కోసం ఆక‌ర్ష‌ణీయ‌మైన రూపంతో డిజైన్ చేసేందుకు కల్కి బృందానికి స‌హాయ ప‌డింద‌ని తెలియ‌జేశారు.

అయితే తాజాగా ఆనంద్ మ‌హీంద్రా.. క‌ల్కి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్‌పై ప్ర‌శంస‌లు కురిపించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. నాగ్ అశ్విన్‌ని చూస్తుంటే గ‌ర్వంగా ఉంద‌ని ఆయ‌న త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. గతంలో నాగ్ అశ్విన్ పోస్ట్‌ చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్‌ను ఆయ‌న ఇప్పుడు షేర్ చేస్తూ.. స‌ర‌దా సంగ‌తుల‌న్నీ కూడా ట్విట్ట‌ర్‌లోనే క‌నిపిస్తాయి. నాగ్ అశ్విన్, అత‌డి టీమ్ గొప్ప‌గా ఆలోచించేందుకు ఏ మాత్రం వెన‌కాడ‌రు. వారిని చూస్తుంటే చాలా గ‌ర్వంగా ఉంది. బుజ్జి వాహనం జయం ఆటోమోటివ్స్ కూడా ఈ వెహికల్ రూపొందించడంలో భాగమైంది అని అన్నారు.ఇక ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్‌పై స్పందించిన నాగ్ అశ్విన్.. సాధ్యం కాదు అనుకున్న కలను సుసాధ్యం చేసిన మీకు ధ‌న్య‌వాదాలు అని అన్నారు. దానికి ‘కలలు కనడం మానొద్దు..’ అంటూ మహీంద్రా రిప్లై ఇచ్చారు.

Latest News