Site icon vidhaatha

Anant Ambani| బాబోయ్.. త‌న పెళ్లికి వచ్చిన స్టార్ హీరోల‌కి అన్ని కోట్ల విలువైన బ‌హుమ‌తి ఇచ్చారా..!

Anant Ambani| రిలయన్స్ అధినే ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుక గురించి దేశ, విదేశాల‌లో ఎంత హాట్ టాపిక్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రెండు నెల‌ల పాటు అనంత్,రాధికాల పెళ్లి వేడుక‌లు జ‌రుగుతూనే ఉండ‌గా, వీటి గురించి ప్ర‌తి ఒక్క‌రు ముచ్చ‌టించుకున్నారు. ఇక జూలై 12న ఈ జంట మూడు ముళ్లు సాక్షిగా ఒక్క‌ట‌య్యారు. అయితే వారి వివాహ వేడుక‌కి స్టార్ హీరోలు సైతం వ‌చ్చి తెగ డ్యాన్స్‌లు చేశారు. ఈ క్ర‌మంలో అనంత్ అంబానీ వారిని విలువైన బహుమతులతో ముంచెత్తారు. ఒక్కొక్కరికి రూ .2 కోట్ల విలువైన చేతి గడియారం అందించారు. షారఖ్ ఖాన్, రణ్ వీర్ సింగ్ సహా తన తరపు స్నేహితుల బృందానికి వీటిని బహుమతిగా ఇచ్చారు అనంత్.

ఆ వాచ్ Audemars Piguet Royal Oak Perpetual Calendar లిమిటెడ్ ఎడిషన్ వాచ్ అని తెలుస్తోంది. పలువురు ఆ వాచీలు ధరించి దిగిన ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వాచీలను ధరించి సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, రణ్‌వీర్ సింగ్ తదితరులు ఫొటోలను పోజులివ్వ‌గా, ఆ పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 41 ఎంఎం 18కే రోజ్ గోల్డ్ డయల్ కలర్, డార్క్ బ్లూ సబ్ డయల్స్, 20 మీటర్ వాటర్ రెసిస్టెన్స్ కలిగిన ఈ వాచీ రిటైల్ ధర 1,05,000 డాలర్లు (87,69,000 రూపాయలు) కాగా, మార్కెట్ ధర 2,50,000 డాలర్లు (2,08,79,000 రూపాయలు)గా తెలుస్తుంది. మొత్తంగా 25 వాచీలను అనంత్ అంబానీ కొనుగోలు చేసినట్లు తెలిసింది. కాగా, ఈ ఖరీదైన వాచీ బహుమతి గురించి నెట్టింట్లో తెగ జోకులు పేలుతున్నాయి. అనంత్ అంబానీ లాంటి ఫ్రెండ్స్ ఉండాలి అని పోస్టులు చేస్తున్నారు.

ఈ గడియారంలో పింక్ గోల్డ్ టోన్డ్ ఉన్న ఇన్నర్ బెజెల్, మ్యానుఫ్యాక్చరింగ్ కాలిబర్ 5134 సెల్ఫ్-వైండింగ్ మూవ్మెంట్ ఈ వాచీకి ఉన్నాయి. ఇది కంప్లీట్‌గా ఆటోమెటెడ్ వాచీ అన్నమాట. ఇది వారం, రోజు, తేదీ, ఖగోళ చంద్రుడి వివరాలు, నెల, లీప్ సంవత్సరం, గంటలు, నిమిషాలను చూపించే శాశ్వత క్యాలెండర్ ను కూడా కలిగి ఉంటుంది. ఇది 40 గంటల బ్యాటరీ పవర్ రిజర్వ్ ని కూడా కలిగి ఉంటుంది. 18 క్యారట్ల పింక్ గోల్డ్ బ్రాస్లెట్, ఎపి ఫోల్డింగ్ బకిల్, అదనంగా బ్లూ అలిగేటర్ స్ట్రాప్ కూడా ఈ వాచీకి అద‌నంగా ఉంటుంది.. 20 మీటర్ల వరకు నీటి నిరోధకత కూడా కలిగి ఉంటుంది.

Exit mobile version