Site icon vidhaatha

Ananth Ambani| అనంత్ అంబాని పెళ్లి వేడుక‌కి మ‌హేష్ బాబే సెంట్రాఫ్ అట్రాక్ష‌న్.. లుక్ అదిరిపోలా..!

Ananth Ambani| అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో జూలై 12న ఘ‌నంగా జ‌రిగింది. ఈ వివాహ వేడుక‌కి దేశ విదేశాల నుండి ఎంతో మంది ప్ర‌ముఖులు హాజ‌రై సంద‌డి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖులు ముంబయిలో సంద‌డి చేశారు. దేశాధినేత‌లు, సినీ, క్రీడా, రాజ‌కీయ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో అనంత్ అంబాని, రాధిక మర్చంట్ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అయితే ఈ పెళ్లి వేడుక‌కి హాజ‌రైన వారిలో మ‌హేష్ బాబు సెంట్రాఫ్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. బ్లాక్ ఆండ్ బ్లాక్ ఔట్ ఫిట్, డిఫరెంట్‌ హెయిర్ స్లైల్, గడ్డంతో మహేష్ బాబు సరికొత్త లుక్‌లో క‌నిపించారు.

 

ఇక మ‌హేష్ బాబుతో పాటు ఆయ‌న భార్య న‌మ్ర‌త‌, కూతురు సితార సంప్ర‌దాయ దుస్తుల్లో వేడుక‌కి హాజ‌రై సంద‌డి చేశారు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు ఫొటోల‌తో పాటు ఆయ‌న ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. రాజ‌మౌళి సినిమాలో మ‌హేష్ లుక్ ఇదే అంటూ ప‌లువురు ముచ్చ‌టించుకుంటున్నారు. మ‌న రాజకుమారుడిని చూసి హిందీ జనాలు కూడా ఏమందం ఇది అని ముచ్చ‌టించుకోవ‌డం మొద‌లు పెట్టార‌ట‌. ఇప్ప‌టికే మ‌హేష్ సినిమా లాంచ్ కావ‌ల‌సి ఉండ‌గా, ఆషాడ మాసం కార‌ణంగా వాయిదా ప‌డిన‌ట్టు తెలుస్తుంది.

 

వీలైనంత త్వ‌ర‌గా మూవీని మొద‌లు పెట్టి 2026లో చిత్రాన్ని విడుద‌ల చేసే ఆలోచ‌న‌లో మ‌హేష్ రాజ‌మౌళి ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే అనంత్ అంబానీ పెళ్లిలో దగ్గుబాటి కుటుంబం కూడా సంద‌డి చేసింది. రానా సతీసమేతంగా పెళ్లికి హాజరయ్యారు. రానా, మిహికా కపుల్ ట్రెడిషనల్ లుక్ లో అందరి దృష్టిని ఆక‌ర్షించారు టాలీవుడ్ సీనియ‌ర్ హీరో విక్టరీ వెంకటేశ్ కూడా అనంత్, రాధిక పెళ్ళిలో సంద‌డి చేశారు. వైట్ షేర్వానిలో ఎప్పటిలాగే ఫ్యామిలీ మెన్ లా కనిపించారు. సూప‌ర్ స్టార్ రజనీ కాంత్ అచ్చ తమిళ్ స్టైల్లో అనంత్ అంబానీ పెళ్లిలో దర్శనమిచ్చారు. లుంగీలో ఆయన మాస్ లుక్ అద‌రిపోయిందని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version