Rohini| రేవ్ పార్టీలో దొరికిన క‌మెడీయన్ రోహిణి.. అరెస్ట్‌ చేసిన పోలీసులు

Rohini| బెంగ‌ళూరులో జ‌రిగిన రేవ్ పార్టీ ఎలాంటి ప్ర‌కంప‌న‌లు పుట్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ పార్టీలో నటి హేమతో పాటు రాజకీయ రంగానికి చెం

  • Publish Date - July 5, 2024 / 12:43 PM IST

Rohini| బెంగ‌ళూరులో జ‌రిగిన రేవ్ పార్టీ ఎలాంటి ప్ర‌కంప‌న‌లు పుట్టించిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ పార్టీలో నటి హేమతో పాటు రాజకీయ రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు అరెస్ట్ కావ‌డం మ‌నం చూశాం. అయితే హేమ తాను రేవ్ పార్టీలో లేన‌ని, ఇంట్లోనే ఉన్న‌ట్టు డ్రామాలు ఆడింది. కాని పోలీసులు ఆమె బ్లెండ్ శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా, అందులో పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో రిమాండ్‌లోకి తీసుకున్నారు. కొద్ది రోజుల పాటు జైలులో ఉంచి ఇటీవ‌ల బెయిల్‌పై ఆమెని విడుద‌ల చేశారు. మ‌రోవైపు రేవ్ పార్టీలో హేమ‌తో పాటు టాలీవుడ్ కి చెందిన శ్రీకాంత్, కొరియో గ్రాఫర్ జానీ ,కన్నడ బ్యూటీ ఆషీ రాయ్ ఉందని వార్త‌లు వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో శ్రీకాంత్, జానీ మాస్ట‌ర్ వాటిని ఖండించారు.

అయితే రేవ్ పార్టీ ప్ర‌కంప‌న‌లు ఇప్ప‌టికీ చ‌ల్లార‌లేదు. ఇంత‌లోనే జబర్ధస్త్ ఫేమ్, యాంకర్, నటి అయిన రోహిణి రేవ్ పార్టీలో పట్టుబడినట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ కావ‌డంతో ఇది చూసి అంద‌రు కంగుతిన్నారు. వీడియోలో మీడియా ఆమెని ఆపుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తుండ‌గా, నాకేం సంబంధం లేదు.. ప్లీజ్ నన్ను వదిలేయండి. బర్త్ డే పార్టీ అంటే వచ్చా అని చెబుతుండగా మీకు పాజిటీవ్ వచ్చిందంట కాదా? అని ప్రశ్నించారు. ఆ స‌మ‌యంలో రోహిణి నేను అస‌లు టేస్ట్ చేయ‌లేదు, పాజిటివ్ ఎలా వ‌స్తుంది, ఈ ఎన్నారై బర్త్ డే పార్టీలు అంటే ముందు వెనుక చూడకుండా రావొద్దు అంటూ ఏడుస్తూ ముందుకు వెళ్లింది.

అయితే వీడియో చూశాక అక్క‌డ అందరికి ఓ అనుమానం వ‌స్తుంది. పోలీసులు, మీడియా వారు కూడా ఒరిజిన‌ల్‌గా అనిపించ‌డం లేదు. మీడియా ప్రతినిదుల మైక్ కి ఎలాంటి ఛానల్ సింబల్ లేక‌పోవ‌డంతో ఇది ఖచ్చితంగా ప్రమోషనల్ వీడియోనే అని అంటున్నారు. ‘బర్త్ డే బాయ్’ ప్రమోషన్ కోసం చేసినట్లు తెలుస్తుంది. వెరైటీగా ఉంటుందని రోహిణి ఇలా చేసిందని, ఈ వీడియోతో హేమ‌పై ఆమె సెటైర్ కూడా వేసిన‌ట్టైందని అంటున్నారు. కాగా, ఈ మ‌ధ్య ప‌రువు ప్ర‌మోష‌న్‌లో భాగంగా నివేదా పెతురాజ్ కూడా ఇలానే డ్రంక్ డ్రైవ్ కేసులో పోలీసుల‌కి ప‌ట్టుబ‌డ్డ‌ట్టు డ్రామాలు ఆడింది.

Latest News