Site icon vidhaatha

NTR| నంద‌మూరి ఫ్యామిలీ నుండి హీరోగా మ‌రో ఎన్టీఆర్ రాబోతున్నారా…!

NTR| విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కి చేసిన సేవ‌లు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కెరీర్‌లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించిన ఎన్టీఆర్ వార‌సలుగా ఇండ‌స్ట్రీకి చాలా మంది వ‌చ్చారు. కాని వారిలో నిల‌దొక్కుకుంది అంటే బాల‌కృష్ణ, జూనియ‌ర్ ఎన్టీఆర్ మాత్ర‌మే. క‌ళ్యాణ్ రామ్ సినిమా నిర్మాత‌గా, హీరోగా రాణించే ప్ర‌య‌త్నం చేస్తున్నా కూడా అంత‌గా స‌క్సెస్ కాలేక‌పోతున్నాడు. అయితే ఇప్పుడు నంద‌మూరి ఫ్యామిలీ నుండి మ‌రో వార‌సుడు రాబోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. హరికృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోగా మ‌రో ఎన్టీఆర్ తెలుగు తెర‌కి ప‌రిచ‌యం కాబోతున్నాడు.

హ‌రికృష్ణ పెద్ద కుమారుడు జానకీ రామ్‌ కొన్నాళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. ఆయ‌నకి ఇద్ద‌రు కుమారులు ఉండ‌గా, ఓ కుమారుడు ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. నేడు ఈ మూవీ ఓపెనింగ్ జ‌ర‌గ‌నుంది. ప్రముఖ దర్శకుడు వైవీఎస్‌ చౌదరీ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతుండటం విశేషం. ఈ సినిమా ఓపెనింగ్‌ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వ‌హిస్తుండ‌గా, కార్య‌క్ర‌మానికి నందమూరి ఫ్యామిలీ నుంచి చాలా మంది హాజరయ్యే అవకాశం ఉంది. అయితే జాన‌కి రామ్ కుమారుడికి కూడా ఎన్టీఆర్ అనే పేరు పెట్టార‌ట‌. ఈ నేప‌థ్యంలో నంద‌మూరి ఫ్యామిలీ నుండి మ‌రో ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకుల‌ని ప‌ల‌కరించ‌బోతున్నాఉ.

ఇప్పటికే సీనియర్‌ ఎన్టీఆర్‌, ఇప్పుడు జూ ఎన్టీఆర్‌ ఉండగా, మరో ఎన్టీఆర్‌ హీరోగా పరిచయం కాబోతుండటంతో ఈ ఎన్టీఆర్‌ నేమ్‌ పెద్ద కన్‌ఫ్యూజన్‌గానూ మారే అవకాశం ఉంది. ఈ కొత్త ఎన్టీఆర్‌ని ఏ ర‌కంగా పిలుచుకుకంటారో చూడాలి. అయితే ఎన్టీఆర్ పేరు పెట్టుకొని ఆ పేరు తగ్గ న్యాయం చేశాడు జూనియ‌ర్ ఎన్టీఆర్. పాన్ ఇండియా స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. న‌ట‌న‌, డ్యాన్స్‌ల‌లో తాత‌కి త‌గ్గ మ‌న‌వడు అనిపించుకున్నాడు. మ‌రి ఇప్పుడు వ‌స్తున్న ఎన్టీఆర్ ఏ మేర‌కు రాణిస్తాడో చూడాలి.

Exit mobile version