Avika Gor| సెక్స్ సీన్స్ చేయ‌డం చాలా బోర్.. అవికా గోర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Avika Gor| చిన్నారి పెళ్లి కూతురు సీరియ‌ల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అందాల భామ అవికా గోర్. ఆ సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల్లో అమ్మ‌డికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఇక ఆ త‌ర్వాత రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఉయ్యాలజాంపాల సినిమాతో హీరోయిన్ గా మారింది. అయితే తొలి సినిమాతో

  • Publish Date - June 15, 2024 / 03:20 PM IST

Avika Gor| చిన్నారి పెళ్లి కూతురు సీరియ‌ల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అందాల భామ అవికా గోర్. ఆ సీరియల్ తో తెలుగు ప్రేక్షకుల్లో అమ్మ‌డికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఇక ఆ త‌ర్వాత రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఉయ్యాలజాంపాల సినిమాతో హీరోయిన్ గా మారింది. అయితే తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ భామ ఆతర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పుడైతే అవికాకి పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేదు. ఏ అవకాశం వ‌స్తే అది చేసుకుంటూ ముందుకు పోతుంది. అవికా గోర్ చేతిలో దాదాపు ఏడెనిమిది సినిమాలు ఉన్నాయి. అందులో ఆమె హీరోయిన్ గా నటిస్తున్న సినిమాలు ఆరు కాగా, వాటిలో కొన్ని సినిమాలకు అవికా గోర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.

తన వద్దకు ఎక్కువగా సస్పెన్స్, థ్రిల్లర్ సబ్జెక్లులే వస్తున్నాయని.. మంచి లవ్ స్టోరీలు వచ్చినా చేస్తానంటూ అవికా చెప్పుకొస్తుంది. నటిగా తనకు ఒకే జానర్‌లో కొనసాగాలని లేదని, ప్రస్తుతం తెలుగులో ఆది సాయికుమార్ హీరోగా ఒక సినిమా చేస్తున్నానని.. అలాగే హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయని వెల్లడించారు. తెరపై ఎంతో క్యూట్ గా, పద్ధతిగా సంప్రదాయానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉండే అవికా గోర్ ఆ త‌ర్వాత కొన్ని సినిమాల‌లో రెచ్చిపోయి న‌టించింది. కాలంతో పాటు మారాల‌ని భావించిందో ఏమో కాని అవికా తెగ రెచ్చిపోయి హంగామా చేసింది.

అయితే ముద్దు సీన్స్, టైట్ హగ్స్, చివరకి సెక్స్ సీన్లలో నటించిన భామ ఈ సీన్లు చేయడం ఎలాంటి ఫీలింగ్ ఇస్తుందన్న ప్రశ్నకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది. ఆ ఇంటర్వూలో ఇంటిమేట్ సీన్లు చేయడంతోపాటు తన బాయ్‌ఫ్రెండ్ మిలింద్ చంద్వానీతో రిలేషన్షిప్ లాంటి వాటిపై స్పందించింది. ఏడేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే టీవీ సీరియల్ తో బిజీగా మారిన ఆమె.. తర్వాత హీరోయిన్ గా మారి సినిమాలు చేసింది. గతేడాది వచ్చిన 1920 అనే హారర్ మూవీలో ఆమె చాలా హాట్ హాట్ సీన్స్ చేసింది. సె*క్స్ సీన్స్ చేయడం సరదాగా ఉంటుందని భావిస్తారు కానీ.. అవి చాలా బోరింగ్ గా ఉంటాయి అని ఆమె చెప్పుకొచ్చింది. అయితే నాతో పాటు ఆ సీన్స్ లో మిగ‌తా వారు కూడా చాలా ఈజీగా చేయ‌డానికి ముఖ్య కార‌ణం కోఆర్డినేటర్ కృష్ణా భట్. ఇమ్రాన్ హష్మి సినిమాలకూ పని చేసిన అనుభవంతోనే .. సెట్స్ లో చాలా మంది యాక్టర్స్ ఫ్రీ గా ఇలాంటి సీన్స్ చేస్తారు.” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Latest News