Site icon vidhaatha

‘దంగల్’​ వసూళ్లు 2వేల కోట్లు – మాకు దక్కింది కేవలం…. : బబితా ఫొగట్

ఎవరి జీవిత గాథ ఆధారంగా దంగల్​(Dangal) సినిమా తీసారో, ఆ భారత మాజీ మల్లయోధురాలు బబితా ఫొగట్(Babita Phogat)​, ఆ సినిమా గురించి ఒక సంచలన విషయం వెల్లడించింది(Revelation). మల్లయుద్ధ రంగం నుండి తప్పుకున్న బబిత ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించింది. తమ జీవిత చరిత్ర(Bio pic) ఆధారంగా తీసిన హిందీ చిత్రం ‘దంగల్’​కు సంబంధించిన కొన్ని ఆర్థిక వివరాలు వెల్లడించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఆమిర్​ఖాన్(Aamir Khan)​ ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రం దేశంలో, దేశం వెలుపలా సంచలన విజయం(Blistering Hit) సాధించి, ఎన్నో బాక్సాఫీస్​ రికార్డులను బద్దలు కొట్టింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2వేల కోట్ల(2000 Crores) వసూళ్లు సాధించిందని సినిమా వ్యాపారవర్గాలు చాలాసార్లు తెలిపాయి. కాకపోతే, నిర్మాతల నుండి తమ కుటుంబానికి దక్కింది కేవలం ఒక కోటి రూపాయలు(1 Crore only) మాత్రమేనని బబితా ఫొగట్​ వెల్లడించింది.

“దంగల్​ వసూలు చేసిన రెండు వేల కోట్ల నుండి ఫొగట్​ కుటుంబానికి దక్కింది కేవలం ఒక కోటి రూపాయలేనా?” అని ఇంటర్వ్యూలో భాగంగా న్యూస్​24(News 24) చానెల్​ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బబితా ఫొగట్​ ఖరాఖండిగా చెప్పిన సమాధానం “అవును”.

‘దంగల్​ రెండువేల కోట్లు సంపాదించిన తర్వాత కూడా కోటి రూపాయల నామమాత్రపు మొత్తం దక్కినందుకు తను గానీ, తన కుటుంబం గానీ నిరాశ చెందారా?’ అన్న ప్రశ్నకు, ప్రేమ – గౌరవం సంపాదించుకోవడం మాత్రమే తమ ఉద్దేశ్యమని, డబ్బు కాదని స్పష్టం చేసింది. “లేదు. నాన్నగారు ఒక విషయం చెప్పారు. మనకు ప్రజల నుండి ప్రేమ, గౌరవం చాలు అని”. 2016లో విడుదలైన దంగల్​ చిత్ర కథ.. బబితా ఫొగట్​, తన అక్క గీతా ఫొగట్​(Geeta Phogat) ఇంకా తండ్రి మహావీర్​ ఫొగట్​ జీవిత గాథ ఆధారంగా తీసింది. మహావీర్​ ఫొగట్(Mahavir Phogat)​ తన కూతుళ్లైన గీత, బబితలను మల్లయోధులుగా దేశం గర్వించే స్థాయికి ఎలా తీర్చిదిద్దాడనేదే స్థూలంగా కథాస్వరూపం.  బబిత 2010 కామన్​వెల్త్​ క్రీడ(2010 CWG)లలో రజత పతకం సంపాదించింది. ఆ తర్వాత  2012లో ప్రపంచ మల్లయుద్ధ చాంపియన్​షిప్(WWC)​లో కాంస్యపతకంతో సరిపెట్టుకున్నా, 2014లో మళ్లీ కామన్​వెల్త్​ గేమ్స్​లో బంగారు పతకం(Gold Medal) గెలుచుకుని భారత కీర్తి పతాకను రెపరెపలాడించింది. 2019లో క్రీడల నుండి తప్పుకుని రాజకీయాలలోకి ప్రవేశించింది.

Exit mobile version