Bala Krishna| మ‌రోసారి అడ్డంగా దొరికిన బాల‌కృష్ణ‌.. అంజ‌లిని అక్క‌డ ట‌చ్ చేయ‌డంతో ఫ్యాన్స్ ఫైర్

Bala Krishna| నంద‌మూరి బాల‌కృష్ణ‌కి వివాదాలు కొత్త కాదు. ఎప్పుడు ఏం మట్లాడ‌తాడో, ఏ స‌మ‌యంలో ఎలా స్పందిస్తాడో బాల‌య్య‌కే అర్ధం కాదు. త‌ర‌చు ఏదో ఒక వివాదంలో నిలుస్తూ ఉండే బాల‌కృష్ణ రీసెంట్‌గా అంజ‌లితో అనుచితంగా ప్ర‌వ‌ర్తించి ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. ఇటీవ‌ల విశ్వక్ సేన్ హీరోగా నేహా శెట్టి, అంజలి హీరోయి

  • Publish Date - June 1, 2024 / 10:28 AM IST

Bala Krishna| నంద‌మూరి బాల‌కృష్ణ‌కి వివాదాలు కొత్త కాదు. ఎప్పుడు ఏం మట్లాడ‌తాడో, ఏ స‌మ‌యంలో ఎలా స్పందిస్తాడో బాల‌య్య‌కే అర్ధం కాదు. త‌ర‌చు ఏదో ఒక వివాదంలో నిలుస్తూ ఉండే బాల‌కృష్ణ రీసెంట్‌గా అంజ‌లితో అనుచితంగా ప్ర‌వ‌ర్తించి ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. ఇటీవ‌ల విశ్వక్ సేన్ హీరోగా నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో బాల‌య్య ..స్టేజ్‍పైకి వచ్చిన తర్వాత పక్కకు జరగాలని అంజలికి సైగ చేశారు బాలకృష్ణ. అంజలి కాస్త పక్కకు వెళ్లారు. అయితే, ఇంకా జరగాలంటూ అంజలిని కాస్త గట్టిగా చేత్తో తోసేయ‌డంతో ఆమె షాక్‌లో ఉంది. కాని వెంట‌నే తేరుకొని ఏం చేయాలో తెలియ‌క తెగ న‌వ్వేసింది.

జరగమంటే.. జరగలేదని బాలయ్య ఏదో అన్నారు. ఆ తర్వాత బాలకృష్ణ అంజలి ఇద్దరూ హైఫై ఇచ్చుకున్నారు. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా అంద‌రి ముందు బాల‌య్య హీరోయిన్‌ని అలా నెట్టడం ఏమి బాగోలేద‌ని నేష‌న‌ల్ మీడియా కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అంజలితో బాలకృష్ణ ప్రవర్తనపై హిందీ సెలబ్రిటీస్ కూడా కొంతమంది మంది పడ్డారు. ఈ క్రమంలో విశ్వక్ అలానే నిర్మాత నాగవంశీ మాత్రం బాలకృష్ణను వెనకేసుకుని వచ్చారు. ఇక మే 31న సినిమా రిలీజ్ అయిన సంద‌ర్భంగా ఓ వీడియో రిలీజ్ చేసింది అంజ‌లి. అందులో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ గా వచ్చినందుకు..బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు. బాలకృష్ణ గారికి..నాకు ఒకరి పట్ల ఒకరికి పరస్పర గౌరవం ఉంది. మేమిద్దరం చాలా కాలం నుంచి గొప్ప స్నేహితులం. ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం నాకు అద్భుతంగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది.

రోవైపు ఈవెంట్‌లో బాలయ్య మందు తాగాడని కూడా వివాదం రాజుకుంది. ఆయ‌న కూర్చున్న ద‌గ్గ‌ర‌ వాటర్‌ బాటిల్ ఉండ‌గా, అక్క‌డ ఉన్న‌ చిన్న వాటర్‌ బాటిల్‌లో మందు ఉంది. దీనిపై కూడా నిర్మాత స్పందించారు. అది సీజీలో చేశారని, కావాలని క్రియేట్‌ చేశారని కవర్ చేశారు నాగవంశీ. అయితే బాలకృష్ణ మరోసారి దొరికిపోయాడు. అంజలిని వెనకాల నుంచి కొట్టిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతుంది. అదే ఈవెంట్‌లో అంజలిని హీరో విశ్వక్‌ సేన్‌ స్టేజ్‌పైకి పిల‌వ‌గా, అప్పుడు బాల‌య్య ప‌క్క‌న కూర్చున్న అంజ‌లి లేచి వెళ్ల‌బోతుంది. ఆ సమ‌యంలో త‌న లెఫ్ట్ హ్యాండ్‌తో వెన‌క భాగంలో ట‌చ్ చేశాడు. ఆ స‌మ‌యంలోను అంజ‌లి స్మైల్‌తోనే క‌వ‌ర్ చేసింది. అయితే ఇది రియల్‌ వీడియోనేనా, లేక సీజీలోనే చేసిందా? అని అడుగుతున్నారు. ఈ వివాదం ఎంత ర‌చ్చ‌గా మారుతుందో చూడాలి

Latest News