Site icon vidhaatha

Bala Krishna| ఏపీ అసెంబ్లీలో ఒక్క‌సారి కూడా క‌నిపించ‌ని బాల‌య్య‌.. అస‌లు కార‌ణం ఇదా?

Bala Krishna| న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నాడు. సినిమా ప‌రంగా చూస్తే అఖండ చిత్రం త‌ర్వాత వ‌రుస హిట్స్ అందుకున్న బాల‌య్య ఇప్పుడు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక రాజ‌కీయంగా బాల‌య్య విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేస్తున్నారు. హిందూపురం నుండి వ‌రుస‌గా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు బాల‌య్య . అయితే పాలిటిక్స్ లో హ్యాట్రిక్ కొట్టిన ఎందుకో బాల‌య్య‌కి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేదు. అందుకు కార‌ణంగా కొన్ని స‌మీక‌ర‌ణాలు అని చెప్పాలి. అయితే మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోయిన కూడా బాల‌య్య ఏ మాత్రం నిరాశం చెంద‌రు. త‌న ప‌ని తాను చేసుకొని పోతుంటారు.

అయితే ప్ర‌స్తుతం ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు వాడి వేడిగా సాగుతుండ‌గా, ఈ స‌మావేశాల‌లో బాల‌య్య ఒక్క‌సారి కూడా క‌నిపించ‌లేదు. దీంతో అంద‌రిలో అనేక అనుమానాలు త‌లెత్తుతున్నాయి. మంత్రి ప‌దవి ఇవ్వ‌నందుకు బాల‌య్య అలిగి అసెంబ్లీ స‌మావేశాల‌కి రావ‌డం లేదా, లేదంటే ఇంకేదైన కార‌ణం ఉందా అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. అయితే అస‌లు కార‌ణం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం బాలయ్య తన సినిమా షూటింగ్ లో ఉన్నాడు. అసెంబ్లీ ఎన్నికల కారణంగా షూటింగ్ కు బాగా గ్యాప్ రావడంతో.. నిర్మాత‌ల‌కి ఇచ్చిన మాట ప్రకారం ప్ర‌స్తుతం త‌న మూవీ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డారు బాలయ్య‌.

బాబీ- బాల‌య్య కాంబోలో రూపొందుతున్న మూవీ ఇప్పుడు రాజస్థాన్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. జైపూర్‌ ప్యాలెస్ లో మూవీ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుండ‌గా, బాలకృష్ణ షూటింగ్‌ బిజీలో ఉన్నారు. బాబీ సినిమాను త్వరలో కంప్లీట్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఈ కారణంగానే నంద‌మూరి బాల‌కృష్ణ‌ అసెంబ్లీకి రాలేదని తెలుస్తోంది. దర్శకులను కాని నిర్మాతలను కాని బాల‌కృష్ణ ఇబ్బంది పెట్టిన సంద‌ర్భాలు లేవు. ఇచ్చిన మాట‌ని బాల‌య్య త‌ప్ప‌క నిల‌బెట్టుకుంటారు. అయితే ఎన్నిక‌ల వ‌ల‌న మూవీ షూటింగ్ ఇప్ప‌టికే లేట్ కావ‌డంతో ఇప్పుడు ఆ మూవీని పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డార‌ట బాల‌య్య

Exit mobile version