Site icon vidhaatha

Bala Krishna| చౌక‌బారు కామెడీ చేసిన అవినాష్‌.. బాల‌య్య బాబుని కించ‌ప‌ర‌చ‌డంతో ఫ్యాన్స్ ఫైర్

Bala Krishna| జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీ షోతో అంద‌రి దృష్టిని ఆకర్షించిన అవినాష్ ఆ త‌ర్వాత బిగ్ బాస్ షోకి వెళ్లి మరింత క్రేజ్ పెంచుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లొచ్చిన తర్వాత అవినాష్‌కి ఆఫ‌ర్స్ వెల్లువ కురుస్తుంది. ప్ర‌స్తుతం ప‌లు షోల‌లో త‌న‌దైన కామెడీతో అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఇటీవ‌ల రీతూ చౌదరీ యాంకరింగ్ చేస్తున్న దావ‌త్ షోలో పాల్గొని త‌న కెరీర్‌లో ఎన్ని అవ‌మానాలు ఎదుర్కొన్నాడో తెలియ‌జేశాడు. లైఫ్ లో ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతోనే జబర్దస్త్ మానేసి బిగ్ బాస్ షోకి వెళ్లాను అని చెప్పాడు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు నేను రూ. 10 లక్షలు కట్టి షో నుంచి బయటకి వచ్చాను అని తెలియ‌జేశాడు.

ఇక తాజాగా ‘నీతోనే డాన్స్ 2.0’ గ్రాండ్ ఫినాలే పాల్గొన్న అవినాష్ కామెడీలో భాగంగా బాల‌య్య బాబుని ఇమిటేట్ చేస్తూ నానా ర‌చ్చ చేశాడు. నోటికొచ్చిన‌ట్టు మాట్లాడుతూ బాలయ్య మాదిరిగా ఇమిటేట్ చేస్తూ చౌక‌బారు కామెడీ చేశాడు. బాల‌య్య న‌టించిన వీర‌సింహారెడ్డి గెట‌ప్ వేసి స్టేజ్‌పైకి వ‌చ్చిన అవినాష్‌. రాధతో మాట్లాడుతూ.. ‘‘ఏం రాధా ఎలా ఉన్నావ్.. నీకేంటి ఎప్పటికీ బాగానే ఉంటావ్‌లే.. ఎవడింగిగిడిడిగిడగీ.. అంటూ ఏదో మాట్లాడాడు. అయితే ఆ త‌ర్వాత మలయాళంలో రాధని కమ్ బ్యాక్ ఇప్పుడిస్తున్నావ్ అని అడిగానంటూ క‌వ‌ర్ చేసుకున్నాడు. ఇక ఇక సదా గురించి డబుల్ మీనింగ్‌లో మాట్లాడాడు అవినాష్. సదాకి తెలుగులో మాట్లాడితేనే స‌రిగ్గా అర్ధం కాదు. ఇక డ‌బుల్ మీనింగ్‌లో మాట్లాడితే ఏం అర్ధ‌మ‌వుతుంది. చేసేదేం లేక అవినాష్ మాట‌ల‌కి న‌వ్వేసింది.

ఆ తరువాత స్టేజ్ మీదికి వచ్చిన సదా.. ‘నందమూరి నాయకా’ అనే పాట‌కి అవినాష్‌తో స్టెప్పులు వేసింది. ఏకంగా స‌దాని ఎత్తుకొని మ‌రీ డ్యాన్స్ చేశాడు. ఆ స‌మ‌యంలో స‌దా త‌ల‌కొట్టుకోవ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇక సదాని ఎత్తుకోవడంతో.. ‘బాలయ్య బాబు గారూ మీరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారండీ’ అని పంచ్ వేసింది భాను శ్రీ. ‘నేను ఏం చేసినా బాలయ్య బాబు చేసినట్టే’ అని కవర్ చేసుకుని నానా ర‌చ్చ చేశాడు అవినాష్‌. దీనిపై నెటిజ‌న్స్ దారుణ‌మైన కామెంట్స్ చేశాడు. ఈ వీడియో బాల‌య్య బాబు చూస్తే నీకు ద‌బిడ దిబిడే అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

Exit mobile version