Bala Krishna| బాల‌య్య రేప్ సీన్స్.. ఆ ఇద్ద‌రు హీరోయిన్స్ అంత టార్చ‌ర్ అనుభ‌వించారా..!

Bala Krishna| నంద‌మూరి న‌ట‌వార‌సుడు బాల‌కృష్ణ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. త‌న తండ్రి మాదిరిగానే కెరీర్‌లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి మెప్పించారు. ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కి పోటీగా సినిమాలు చేస్తూ అల‌రిస్తున్నారు. మ‌రోవైపు రాజ‌కీయాల‌తో కూడా బిజీగా ఉన్నారు. అయితే బాల‌య్య త‌న కెరీర్‌లో ప్ర‌యోగాలు చాలా చేశాడు. ఇందులో కొన్ని స‌క్సెస్ కాగా, మ‌రి కొన్ని నిరాశ క‌లిగించాయి. అయితే బాల‌య్య కొన్ని సార్లు నెగెటివ్ షేడ్స్

  • Publish Date - June 20, 2024 / 08:10 PM IST

Bala Krishna| నంద‌మూరి న‌ట‌వార‌సుడు బాల‌కృష్ణ ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. త‌న తండ్రి మాదిరిగానే కెరీర్‌లో ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి మెప్పించారు. ఇప్ప‌టికీ కుర్ర హీరోల‌కి పోటీగా సినిమాలు చేస్తూ అల‌రిస్తున్నారు. మ‌రోవైపు రాజ‌కీయాల‌తో కూడా బిజీగా ఉన్నారు. అయితే బాల‌య్య త‌న కెరీర్‌లో ప్ర‌యోగాలు చాలా చేశాడు. ఇందులో కొన్ని స‌క్సెస్ కాగా, మ‌రి కొన్ని నిరాశ క‌లిగించాయి. అయితే బాల‌య్య కొన్ని సార్లు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌ల‌లో కూడా న‌టించి మెప్పించాడు. స్టార్ హీరోగా ఉన్న స‌మ‌యంలో కూడా రేప్ సీన్స్‌లో న‌టించి ఔరా అనిపించాడు.సాధార‌ణంగా ఓ స్టార్ హీరో అలాంటి సాహ‌సాల‌కి ఒడిగ‌ట్ట‌రు. కాని బాల‌య్య మాత్రం త‌న ఇమేజ్ ప‌క్క‌న పెట్టి మ‌రీ మాన‌భంగం స‌న్నివేశాల‌లో న‌టించాడు.

1997లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన పవిత్ర ప్రేమ చిత్రం ఎంత మంచి హిట్ అయిందో మ‌నం చూశాం. ఇందులో బాల‌య్య స‌ర‌స‌న లైలా, రోషిణి క‌థానాయిక‌గా న‌టించింది. మూవీలో లైలా డాక్ట‌ర్ పాత్ర పోషించ‌గా అందులో బాల‌య్య‌-లైలా మధ్య రేప్ సీన్ ఉంటుంది. ఆ రేప్ సీన్ కాస్త క‌టువుగానే ఉంటుంది. చీక‌టి గ‌దిలో మృగం మాదిరిగా ఆమెపై విరుచుకుప‌డి మానం దోచుకుంటాడు. అయితే ఆ స‌మ‌యంలో హీరోయిన్ చేతిపై ఉన్న ప‌చ్చ‌బొట్టుని చూస్తుంది. కాళి అని క‌నిపించ‌డంతో అతనిపై ప్ర‌తీకారం తీర్చుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా బాల‌య్య సుల్తాన్ అనే చిత్రంలో కూడా నెగెటివ్ పాత్ర పోషించాడు సమరసింహారెడ్డి వంటి ఇండస్ట్రీ హిట్ అనంతరం సుల్తాన్ చిత్రం విడుద‌ల కాగా, ఇందులో కృష్ణ‌, కృష్ణంరాజు కీల‌క రోల్స్ చేశారు. ఇందులో బాల‌య్య డ్యూయ‌ల్ పాత్ర పోషించారు.

ఇందులో బాల‌య్య గెట‌ప్స్ మార్చుతూ ప్ర‌భుత్వానికి స‌వాల్ విసురుతూ ఉంటాడు. ఇందులో రోజా, రచన, దీప్తి భట్నాగర్ హీరోయిన్స్ గా నటించారు. రోజా తో బాలకృష్ణకు రేప్ సీన్స్ ఉన్నాయి . ఇంటికి వచ్చినప్పుడల్లా ఆమె మీద మృగంలా దాడి చేసి త‌న పైశాచిక‌త్వం ప్ర‌ద‌ర్శిస్తూ ఉంటాడు. సుల్తాన్‌లోని బాల‌య్య పాత్ర చాలా గంభీరంగా ఉంటుంది. పవిత్ర ప్రేమ, సుల్తాన్ చిత్రాల్లో బాలకృష్ణ చేసిన రేప్ సీన్స్ ఫ్యాన్స్ కి కూడా మింగుడుప‌డ‌ని విధంగా ఉన్నాయి. ఇలా బాల‌య్య నెగెటివ్ పాత్ర‌లు చేయ‌డం వ‌ల్ల‌నో ఏమో కాని రెండు చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టాయి. సమరసింహారెడ్డి థియేటర్స్ లో ఉండగానే సుల్తాన్ మూవీ థియేట‌ర్‌లోకి వ‌చ్చి దారుణ‌మైన ప‌రాభ‌వాన్ని చ‌వి చూసింది…

Latest News