Site icon vidhaatha

Bala Krishna| ఎట్ట‌కేల‌కి బాల‌య్య వివాదంపై స్పందించిన అంజ‌లి.. ఏమ‌ని చెప్పిందంటే..!

Bala Krishna| విశ్వ‌క్ సేన్ న‌టించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాల‌కృష్ణ ముఖ్య అతిథిగా హాజ‌రు కాగా, ఆయ‌న స్టేజ్‌పై అంజ‌లిని నెట్టేయ‌డం పెద్ద ర‌చ్చ‌గా మారింది. ఇప్పుడు ఎక్క‌డ చూసిన దీని గురించే చ‌ర్చ న‌డుస్తుంది. సామాన్యులతో పాటు సెల‌బ్రిటీలు సైతం బాల‌య్య చేసిన ప‌నిని ఖండిస్తున్నారు.కొంచం కూడా సభ్యత లేని ఈ మనిషి ఎవరూ? అంటూ బాలీవుడ్ డైరెక్ట‌ర్ హ‌న్స‌ల్ మెహ‌తా కామెంట్ చేశారు. . ప్రస్తుతం ఆయన పోస్ట్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఆయన కామెంట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు హన్సల్‌ మెహతాకు సపోర్టు చేస్తూ బాలయ్యపై విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే వివాదం ర‌చ్చ‌గా మారుతున్న స‌మ‌యంలో విశ్వ‌క్ సేన్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆయ‌న కావాల‌ని చేయ‌లేదు, స‌ర‌దాగా చేశారు. వారిద్ద‌రి మ‌ధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంద‌నేలా కామెంట్ చేశారు.అయితే విశ్వ‌క్ దానిని క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేసిన కూడా ర‌చ్చ‌గా మారుతుంది. ఈ స‌మ‌యంలో అంజ‌లి త‌న సోష‌ల్ మీడియా ద్వారా ఓ వీడియో రిలీజ్ చేసి ఈ ర‌చ్చ‌కి పులిస్టాప్ పెట్టే ప్ర‌య‌త్నం చేసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా వచ్చినందుకు బాలకృష్ణ గారికి ప్ర‌త్యేక‌ ధన్యవాదాలు. బాలకృష్ణ గారికి నాకు ఒకరి పట్ల ఒకరికి మంచి గౌరవం ఉంది. మేము చాలా కాలం నుంచి గొప్ప స్నేహితులం. ఆయనతో మళ్లీ వేదిక పంచుకోవడం అద్భుతంగా అనిపించింది అని అంజ‌లి తెలియ‌జేసింది.

అయితే బాల‌య్య‌పై జ‌రుగుతున్న ప్ర‌చారానికి ఇండైరెక్ట్‌గా రియాక్ట్ అయ్యారు అంజలి. మరి ఇప్ప‌టికైన ఈ వివాదం స‌ద్దుమ‌ణుగుతుందా లేదా అనేది చూడాలి. గతంలో డిక్టేటర్ చిత్రంలో బాలకృష్ణ, అంజలి కలిసి నటించారు. అంజలికి టాలెంట్, ప్యాషన్ చాలా ఉన్నాయని బాల‌య్య‌ ప్రశంసించారు బాలయ్య. అలాగే, ఇండస్ట్రీలో తాను కొందరితోనే చనువుగా ఉంటానని, అందులో విశ్వక్ ఒకరని బాలకృష్ణ చెప్పారు. అయితే బాల‌య్య కావాల‌ని చేశారో లేక స‌రదాగా చేశారో తెలియ‌దు కాని ఆయ‌న చేసిన ప‌ని పలు నేషనల్ ఛానల్స్ ఈ ఘటన వీడియోను చూపిస్తూ బాలకృష్ణ ప్రవర్తనను తప్పుబట్టారు.

Exit mobile version