Bala Krishna| విశ్వ విఖ్యత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన బాలకృష్ణ ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా సత్తా చాటుతున్నారు. వరుస హిట్స్ అందుకుంటున్న బాలకృష్ణ లో చిన్న సినిమాలకు సైతం అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ఈవెంట్‌కు హాజరయ్యారు. విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ మే 31వ తేదీన రిలీజ్ కానుండగా, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నగరంలో అట్టహాసంగా జరిగింది. ఈవెంట్‌కి నటసింహా నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చేసి తెగ సందడి చేశారు.
అయితే ఈవెంట్‌లో బాలయ్య చేసిన పని ఒకటి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆడిటోరియంలోనే బాలయ్య మందుని సేవించారు. అందుకు సంబంధించిన విజువల్స్ కెమెరాలలో రికార్డ్ కావడంతో అది చూసిన వారందరు షాక్ అయ్యారు. ఇక అలానే స్టేజ్ మీద బాలకృష్ణ, నేహాశెట్టి, అంజలి పక్క పక్కన నిల్చొని ఉండగా, బాలకృష్ణ.. అంజలిని కాస్త పక్కకు జరగమని చెబుతూ ఒక్కసారిగా తోసేసాడు. వీళ్ల మధ్యలో ఉన్న నేహాశెట్టి కూడా ఒక్కసారిగా షాకైంది.. అయితే అంజలి- నేహా శెట్టి నవ్వుతూనే ఉన్నారు. కాసేపు బాలయ్య ముఖం మాత్రం సీరియస్ గా కనిపించిన వెంటనే నవ్వేశాడు. ఇక అంజలీతో మాట్లాడుతూ.. సరదాగా పంచ్‌లు వేశాడు. తర్వాత అంజలికి నవ్వుతూ హైఫై కూడా ఇచ్చాడు బాలయ్య. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
దీనిపై పలువురు పలు రకాలుగా మాట్లాడుతున్నారు. అంజలి ఏడవలేక నవ్వుతూ అలా కవర్ చేసింది అని అంటున్నారు. బాలయ్య బాబు అభిమానులు మాత్రం ఈ చర్యను కూడా సమర్థిస్తూనే ఉండగా, మిగతా వారు మాత్రం దారుణమైన విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సంఘటనపై బాలయ్యని తీవ్రంగా ట్రోల్ చేస్తుండగా, దీనిపై ఎవరైన స్పందిస్తారా అనేది చూడాలి.