Site icon vidhaatha

Bala Krishna| బాల‌య్య అభిమానులు బీ రెడి.. అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 4 వ‌చ్చేస్తోంది.. ఎప్ప‌టి నుండి అంటే..!

Bala Krishna| నంద‌మూరి బాల‌య్య ఈ వ‌య‌స్సులోను ఫుల్ జోష్‌లో ఉండి వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో బాల‌య్య చేసిన అన్ని సినిమాలు కూడా సూప‌ర్ హిట్‌. ఇక ప్ర‌స్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో ఎన్ బి కే 109 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇక ఈ మూవీ పూర్తైన త‌ర్వాత బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సీక్వెల్ మొద‌లు పెట్ట‌నున్నారు.ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక త‌న త‌న‌యుడు మోక్ష‌జ్ఞ‌తో క‌లిసి బాల‌య్య సినిమా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

అయితే బాల‌య్య‌లోని కొత్త కోణాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చిన షో అన్‌స్టాపబుల్. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ప్ర‌సారం అయిన అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కే షో సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. బాలయ్య హోస్టింగ్ ని ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆయన సెలెబ్రెటీలతో ఇంటరాక్ట్ అయిన విధానం .. వాళ్లతో సీక్రెట్స్ చెప్పిస్తూ ఆడియ‌న్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డం ప్ర‌తి ఒక్క‌రికి న‌చ్చింది. మూడు సీజ‌న్స్ స‌క్సెస్ ఫుల్‌గా న‌డ‌వ‌గా, ఇప్పుడు నాలుగో సీజ‌న్ కోసం అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.. ఈ క్రమంలో ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అన్ స్టాపబుల్ నాలుగో సీజన్ దసరా పండుగ కనుకగా ప్రారంభించాలని నిర్వాహ‌కులు భావిస్తున్న‌ట్టు టాక్.

నాలుగో సీజన్ మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 12వ తేదీన స్ట్రీమింగ్ కానుంద‌ని స‌మాచారం. ఇక ఈ షోకి వ‌చ్చే సెల‌బ్రిటీలు టాలీవుడ్ టాప్ హీరోలు అని టాక్ వినిపిస్తుంది. అన్ స్టాపబుల్ సీజన్ 4 కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో ఆహా ఎనౌన్స్ చేయనుందట. అయితే గత సీజన్లతో పోలిస్తే ఈసారి అంతకుమించి ఎంటర్టైన్మెంట్ ఉండేలా మేక‌ర్స్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. అక్టోబర్ లో స్టార్ట్ అయి డిసెంబర్ వరకు ఈ షోని కొనసాగించనున్నట్లు తెలుస్తుంది.. ఇదే నిజ‌మైతే బాల‌య్య అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు.

Exit mobile version