Site icon vidhaatha

Bharateeyudu 2 Review | భారతీయుడు 2.. ఎలా ఉన్నాడు.?

సినిమా : భారతీయుడు 2
నిర్మాత : లైకా ప్రొడక్షన్స్​
దర్శకుడు : శంకర్​ షణ్ముగం
నటీనటులు : కమల్​ హాసన్​, సిద్ధార్థ, రకుల్​ప్రీత్​ సింగ్​, బ్రహ్మానందం​, ఎస్​జే సూర్య, సముద్రఖని..తదితరులు
సంగీతం : అనిరుధ్​ రవిచంద్రన్​
నిడివి : 3 గం. 1 నిమిషం

దేని గురించి(Plot)?

భారతీయుడు 2 (Bharateeyudu 2)ద్వారా సేనాపతి(Senapathy) మళ్లీ రంగప్రవేశం చేసాడు. దేశంలోని భయంకరమైన అవినీతి(Corruption)ని రూపుమాపడానికి కంకణం కట్టుకుని వస్తాడు. కానీ, సేనాపతిని ప్రజలే లక్ష్యంగా చేసుకుని తిరస్కరించడం చుట్టే సినిమా కథ అంతా తిరుగుతుంది.

కథంటేంటే..

చిత్రా అరవింద్ (సిద్దార్థ్) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి సోషల్ మీడియా వేదికగా అవినీతి, అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటాడు. బార్కింగ్ డాగ్స్(Barking Dogs) అనే యూట్యూబ్ చానెల్ ద్వారా అవినీతిని వ్యంగంగా ఎండగడుతుంటాడు.. సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని, అవినీతిని నిర్మూలించాని తపన పడుతుంటాడు అరవింద్. కానీ అతనికే సమస్యలు వస్తాయి. ఈ అవినీతిని అరికట్టాలంటే ఇండియన్ Indian (కమల్ హాసన్) రావాల్సిందే అని ఈ స్నేహితుల బృందం కలిసి కమ్ బ్యాక్ ఇండియన్(#ComebackIndian) అనే హ్యాష్ ట్యాగ్‌తో సోషల్​ మీడియాను కదిలిస్తారు దాంతో సేనాపతి (కమల్ హాసన్) తిరిగి రంగంలోకి దిగుతాడు. సేనాపతి యువతకు ఇచ్చిన సందేశం ఏంటి? ఆ సందేశాన్ని పాటించిన యువతకు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? కమ్ బ్యాక్ ఇండియన్ నుంచి గో బ్యాక్ ఇండియన్(#GobackIndian) అయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఈ క్రమంలో సేనాపతిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన సీబీఐ ఆఫీసర్ ప్రమోద్ (బాబీ సింహా) సేనాపతిని పట్టుకోగలిగాడా? లేదా? ఇందులో కళా వల్లభుడు సద్గుణ పాండ్యన్ (ఎస్ జే సూర్య ) పాత్ర ఏంటి? అన్నదే కథ.

 

నటీనటుల పెర్​ఫార్మన్సెస్​(Performances):

మొత్తం సినిమానంతా అంతా కమల్​ ఒక్కడే మోసాడు. ఆయన్ను తప్పుపట్టేంత అవకాశం ఎక్కడా ఇవ్వలేదు. బాగా నిరాశపర్చిన విషయం ఏంటంటే, ఆయన గెటప్​. మొదటి భాగంలో ఉన్నదంతా తీసేసి, పొడుగాటి జుట్టుతో యాక్షన్​ ఘట్టాలు నవ్వు పుట్టించేలా ఉన్నాయి. ఇక సిద్ధార్థ పాత్రలో పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, తన నటన మాత్రం ఆకట్టుకుంది. తల్లి అంత్యక్రయల సందర్భంగా సేనాపతికి ఎదురుతిరిగినప్పుడు ఎమోషన్స్​ బాగా పలికించగలిగాడు. రకుల్​ప్రత్​ పాత్ర ఓ మెరుపుతీగ. ఎందుకొస్తుందో, ఎందుకుపోతుందో తెలియదు. మనం ఈజీగా ఈ పాత్రను మర్చిపోవచ్చు. విచిత్రంగా ఎస్​జే సూర్య నుండి ప్రేక్షకులు ఆశించిన బ్లాస్ట్​లు కూడా ఏమీ లేవు. ఇది కూడా మరో రకుల్​ లాంటి పాత్రే. Lack of emotions and strong bond of the Roles

మొదటిభాగంలాగా దీన్ని మలచలేకపోయాడు శంకర్​. అందులో ఉన్న బిగింపు, భావోద్వేగాలు, పాత్రల ఔచిత్యాలు అన్నీ మారిపోయాయి. అసలు ఇది భారతీయుడుకి సీక్వెల్​ అన్న విషయమే మర్చిపోయి తీసిన సినిమా. సేనాపతి పాత్రను కూడా ప్రేక్షకులకు కనెక్ట్​ అయ్యేలా రాసుకోలేదు. వచ్చినప్పుడల్లా ఎవరినో ఒకరిని చంపడం తప్ప సేనాపతికి కూడా పెద్దగా పనిలేదు. సేనాపతి ఇచ్చే కొటేషన్లు మాత్రం బాగుంటాయి. క్లైమాక్స్​కు ముందు(Pre-Climax) జనాలు సేనాపతిని రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నించడంలో ఏ మాత్రం వాస్తవికత కనబడదు. కాకపోతే, శంకర్​ సినిమాల్లో ఉంటే భారీతనం, గ్రాండ్​ విజువల్స్​, గ్రాఫిక్స్​ అద్భుతంగా ఉన్నాయి. భారతీయుడు 1కు ఏ మ్యూజిక్ (AR Rehaman)అయితే ప్రాణమయిందో, ఇందులో అనిరుధ్​ ఆ మ్యాజిక్​ కొనసాగించలేకపోయాడు. తనకు అలవాటైన బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ తప్ప, ఒక్క పాట కూడా కనీసం గుర్తుకుఉండవు. భారతీయుడు పాటలు ఇప్పటికీ వినాలనిపిస్తుంటాయి. సాధారణంగా సీక్వెళ్లు హిట్​ కావనే సూత్రాన్ని భారతీయుడు 2 మరోసారి రుజువుచేసింది. థియేటర్​కెళ్లి, 50 లేదా 70 రూపాయలు అదనంగా ఖర్చు చేసి చూడాల్సిన సినిమా అయితే కాదు. మహా అయితే నెలలో ఓటీటీలోకి ఎలాగూ వస్తుంది కాబట్టి వెయిట్​ చేయడం బెటర్​.

రేటింగ్​ : 2/5

Exit mobile version