Bigg Boss 8 Telugu | త్వరలో బిగ్‌బాస్‌-8 తెలుగు సీజన్‌.. కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ మామూలుగా లేదుగా..?

Bigg Boss 8 Telugu | తెలుగులో ఇండస్ట్రీలో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌. ఇప్పటికే ఈ షో ఏడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్నది. త్వరలో ఎనిమిదో సీజన్‌ మొదలు కాబోతున్నది. ఈ షోకు అభిమానుల నుంచి ఆదరణ లభించింది. షో మొదలైన నాటి నుంచి చివరి ఎపిసోడ్‌ వరకు అభిమానులు ఉత్కంఠగా చూస్తుంటారు. మరీ ముఖ్యంగా శని, ఆదివారాలు.. సోమవారాలు మాత్రం అస్సలు మిస్సవ్వరు.

  • Publish Date - July 2, 2024 / 12:00 PM IST

Bigg Boss 8 Telugu | తెలుగులో ఇండస్ట్రీలో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌. ఇప్పటికే ఈ షో ఏడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్నది. త్వరలో ఎనిమిదో సీజన్‌ మొదలు కాబోతున్నది. ఈ షోకు అభిమానుల నుంచి ఆదరణ లభించింది. షో మొదలైన నాటి నుంచి చివరి ఎపిసోడ్‌ వరకు అభిమానులు ఉత్కంఠగా చూస్తుంటారు. మరీ ముఖ్యంగా శని, ఆదివారాలు.. సోమవారాలు మాత్రం అస్సలు మిస్సవ్వరు. తాజాగా బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌ ఎప్పుడు మొదలవుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. షో యాజమాన్యం వారికి గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆగస్టు 8 లేదంటే 11 తేదీల్లో బిగ్‌ బాస్‌ 8వ సీజన్‌ను లాంచనంగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

అలాగే, ప్రస్తుతం షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌కు సంబంధించిన వివరాలు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సారి బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టబోయే వారిలో శిరీష అలియాస్ బర్రెలక్క, నటి హేమ, టాలీవుడ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, నటి సురేఖవాణి, యాంకర్‌ రీతూ చౌదరి ఉన్నట్లు తెలుస్తున్నది. అలాగే, జబర్దస్త్‌ కమెడియన్‌ కిరాక్‌ ఆర్పీ, కుమారీ ఆంటీ, బ్రహ్మముడి సీరియల్‌ హీరో మానస్‌, హీరోయిన్‌ దీపిక పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. షోలో అమృత ప్రణయ్‌ పేరు సైతం వినిపిస్తున్నది. పరువు హత్య ఘటనలో అమృత ప్రణయ్‌ పేరు దేశవ్యాప్తంగా సంచలనమైంది. కులాంతర వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

దీంతో కోపోద్రిక్తుడైన అమృత తండ్రి.. ప్రణయ్‌ని దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. తాజాగా అమృతను ఆమెను సైతం బిగ్‌బాస్‌లోకి తీసుకురావాలని షో నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉన్నదో తెలియదు. కానీ, ఈ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నది. ఇక బిగ్‌బాస్‌ హోస్ట్‌గా నాగార్జున వ్యవహరించనున్న విషయం తెలిసిందే. వరుసగా మూడో సీజన్‌ నుంచి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 8వ సీజన్‌కు సైతం ఆయనే హోస్ట్‌గా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బిగ్‌బాస్‌ బజ్‌ షోకు శివాజీ హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తున్నది.

Latest News