Site icon vidhaatha

Bigg Boss8| బిగ్ బాస్ సీజ‌న్ 8 కంటెస్టెంట్స్ లీక్ చేసిన ఆదిరెడ్డి.. ఈ సారి భారీ మార్పుల‌ట‌..!

Bigg Boss8| బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం ఎంత సక్సెస్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సీజ‌న్ 7కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో ఇప్పుడు సీజ‌న్ 8ని మ‌రో లెవ‌ల్‌లో ప్ర‌సారం చేయాల‌ని చూస్తున్నారు. సీజన్ 6 డిజాస్టర్ కావడంతో ఉల్టా పుల్టా అంటూ సీజన్ 7 తీసుకు వ‌చ్చారు. దీని సక్సెస్ జోష్ ఇచ్చింది. ఇదే జోరులో సీజన్ 8 ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే గ‌త కొద్ది రోజులుగా సీజ‌న్‌8కి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. సెప్టెంబ‌ర్ 1 నుండి ఇది ప్ర‌సారం కానుంద‌ని, కంటెస్టెంట్స్ వీరేనంటూ ప‌లు ప్రచారాలు సాగిన దీనిపై పూర్తి క్లారిటీ అయితే లేదు.

అయితే యూట్యూబర్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఆయనకున్న సమాచారాన్ని బట్టి కొందరు పేర్లను రివీల్ చేశాడు. తన యూట్యూబ్ ఛానల్ లో సీజ‌న్ 8లో పాల్గొన‌బోయే కంటెస్టెంట్స్ గురించి చెబుతూ వీడియో చేశాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. అయితే ఆదిరెడ్డి చెప్పిన జాబితాలో బంచిక్ బబ్లు, హీరో రాజ్ తరుణ్, నటి సోనియా సింగ్ , నటి హేమ , ఫార్మింగ్ నేత్ర, నేత్ర మాజీ భర్త వంశీ. వీరిలో ఇద్దరూ రావొచ్చట. నేత్ర కి ఎక్కువ ఛాన్స్ ఉందట. జబర్దస్త్ నరేష్ లేదంటే రియాజ్ వచ్చే అవకాశం ఉంది. రీతూ చౌదరి, సురేఖ వాణి లేదంటే ఆమె కూతురు సుప్రీత రావచ్చట. కిరాక్ ఆర్పీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అని అన్నాడు. కుమారి ఆంటీ, బర్రెలక్క, హీరోయిన్ కుషిత కల్లపు, బుల్లెట్ భాస్కర్ లేక చమ్మక్ చంద్ర జబర్దస్త్ నుండి రావొచ్చట.

వీరే కాకుండా అమృత ప్రణయ్ వచ్చే ఛాన్స్ ఉందని అన్నాడు. నీతోనే డాన్స్ షోలో పాల్గొన్న జంటల్లో ఒకరు లేదా ఒక జంట రావొచ్చట. పాత కంటెస్టెంట్స్ లో అంజలి పావని, యాంకర్ శివకు ఎక్కువ ఛాన్స్ ఉందని సమాచారం. నయని పావనికి కూడా అవకాశం ఉంద‌ని అన్నాడు. స్రవంతి చొక్కారపు, సోహెల్ కి కూడా ఛాన్స్ ఉంది. చెఫ్ సంజయ్ తుమ్మ, రైతుబడి రాజేంద్ర రెడ్డి, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు కూడా వచ్చే అవకాశం ఉందంటూ ఆదిరెడ్డి త‌న వీడియోలో తెలియ‌జేశాడు. మ‌రి ఆయ‌న చెప్పిన లిస్ట్ ప్ర‌కారం ఎంత మంది సీజ‌న్ 8కి సెల‌క్ట్ అవుతారో చూడాలి. కాగా, ఆదిరెడ్డి బిగ్ బాస్ గురించి చెప్పే రివ్యూలకు లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. దాని ద్వారా బాగా సంపాదిస్తుండ‌డం కూడా మ‌నం చూస్తూనే ఉన్నాం.

Exit mobile version