Site icon vidhaatha

BUJJi| భైర‌వ “బుజ్జి”లో అంత స్పెషాలిటీ ఏంటి..ఫీచర్స్ ఏంటే తెలిస్తే షాక‌వ్వ‌డం ఖాయం..!

BUJJi| డార్లింగ్ ప్ర‌భాస్ నుండి వ‌స్తున్న మ‌రో క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ క‌ల్కి. గత ఏడాది సలార్ మూవీతో బాక్సాఫీసును ఊచకోత కోసిన ప్ర‌భాస్ ఇప్పుడు భైర‌వగా ప్రేక్ష‌కుల‌కి కావ‌ల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధ‌మ‌య్యాడు.జూన్ 27న ఈ సినిమా విడుద‌ల కానుండ‌గా, మూవీకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఇక ఈ మూవీలో చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉండ‌గా, అందులో బుజ్జి అనేది ప్ర‌త్యేక పాత్ర పోషిస్తుంది. స్క్రాచ్ 4 పేరుతో మే 22న ఏర్పాటు చేసిన‌ ఈవెంట్‌లో బుజ్జిని లాంచ్ చేశారు. బుజ్జి కారులో వచ్చి అంద‌రిని మెస్మ‌రైజ్ చేశాడు ప్ర‌భాస్. గ‌తంలో ఎప్పుడు లేని విధంగా ప్ర‌భాస్ అలా కారులో ఎంట్రీ ఇవ్వ‌డంతో అంద‌రు అరుపులు, కేకలతో ఆ ప్రాంగణమంతా దద్దరిల్లిపోయేలా చేశారు.

ఇక బుజ్జి లుక్‌కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా కాగా,ఇప్పుడు అంద‌రు కూడా దాని గురించే ముచ్చ‌టించుకుంటున్నారు. బుజ్జిని ఎలా తయారు చేశారు ? ఎవరు.. ఎక్కడ రెడీ చేశారు.. ? ఎంత ఖర్చు అయ్యింది…? అసలు ఫీచర్స్ ఏంటీ ..? అనే విషయాలు తెలుసుకోవడానికి అడియన్స్ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలో బుజ్జికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. బుజ్జిని తయారు చేసేందుకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు మహీంద్రా, జాయోమ్ ఆటోమోటివ్ జ‌త క‌ట్ట‌గా, దీనిని త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో రూపొందించారు. దాదాపు రూ.7 కోట్లు దీనికి ఖ‌ర్చు చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇక ఇందులో రైట్ సైడ్ కారు టైర్ చూస్తే.. ఓ సగటు మనిషిని మించిపోయాలా డిజైన్ చేశారు.

ఈ టైర్ పొడవు -6075 మిమీ, వెడల్పు-3380మిమీ,ఇక ఎత్తు-2186మిమీ. రిమ్ సైజ్-34.5 ఇంచెస్. ఈ కారును టైర్లను ప్రముఖ టైర్ల కంపెనీ సీయెట్ (CEAT) ప్రత్యేకంగా తయారు చేసింది. ఈ కారు వెయిట్ 6 టన్నులట. పవర్ 94 Kw, బ్యాటరీ 47 KWH అని తెలుస్తుంది.. వెనుక వైపు ఓ పెద్ద టైర్ ఉంటుంది. ఇందులో హీరో తన కోసం ఈ స్పెషల్ కారును తయారు చేస్తున్నట్లు సమాచారం. ప్ర‌భాస్ కోసం ఈ కారుని త‌యారు చేసేందుకు ఇంజ‌నీర్స్ చాలా క‌ష్ట‌ప‌డ్డార‌ట‌. ఇక ఈ బుజ్జి కారుని లాంచ్ చేసేందుకు మే 22న భారీ ఈవెంట్ కూడా ఏర్పాటు చేయ‌డం మ‌నం చూశాం. దీని కోసం నాలుగు కోట్ల వ‌రకు ఖ‌ర్చు చేశార‌ని టాక్. కల్కి సినిమా త‌ర్వాత ఇలాంటి కార్లు మార్కెట్‌లోకి వ‌చ్చిన ఆశ్చర్య‌పోన‌క్క‌ర్లేదు.

Exit mobile version