Anasuya| చిన్మయి శ్రీ పాద గురించి తెలుగు, తమిళ ప్రేక్షకులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చాలా సుపరిచితం. గతంలో సమంతకు డబ్బింగ్ చెప్పడంతో చాలా ఫేమస్ అయింది. అయితే చిన్మయి కొద్ది రోజులుగా కెరీర్‌పై కాకుండా సమాజంలో జరిగే అన్యాయాలపై ఎక్కువగా ప్రశ్నిస్తుంది. మీటూ ఉద్యమంపై కృషి చేస్తుంది. వైరముత్తు లాంటి దిగ్గజాలపై సంచలన ఆరోపణలు చేసినందున చిన్మయిని కొలీవుడ్ ఇండస్ట్రీ బ్యాన్ చేసింది. అయినప్పటికీ కూడా తన గొంతు వినిపిస్తూనే ఉంది. రీసెంట్‌గా సలార్ నటుడు జాన్ విజయ్ బాగోతం బయటపెట్టి అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక కొద్ది గంటల తర్వాత అనసూయకి కూడా ఓ రేంజ్‌లో ఇచ్చి పడేసింది.
ఓ షోలో అనసూయ చిన్న పిల్లాడిని ఎత్తుకుని తన మొహం చూపించి.. ఇక్కడ ముద్దు పెట్టు.. అక్కడ ముద్దు పెట్టు అంటూ తన పెదాలపై కూడా కిసెస్ పెట్టించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియో పైనే చిన్మయి ఫైర్ అవుతూ ఇన్ స్టా లో పోస్ట్ పెట్టింది. డైరెక్ట్ గా అనసూయ పేరు అందులో ప్రస్తావించకపోయిన .. ఆమెను టార్గెట్ చేస్తూ ఈ పోస్ట్ పెట్టినట్టు అందరికి అర్ధమైంది . చిన్న పిల్లలతో ఇలాంటి పనులేంటి? ఇది వినోదమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఒక ఫీమేల్ హోస్ట్.. ఒక చిన్న పిల్లాడిని ముద్దు ఇవ్వమని అడిగడం నేను చూశాను. కాకపోతే ఆ సీన్ చూసి అక్కడ ఆడియన్స్, పేరెంట్స్ చాలా నవ్వుతున్నారు.
ఇంక ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. ఇలా చేయడం వల్లనే పిల్లలపై చాలా దుష్ప్రభావం పడుతుంది. ఒకవేళ ఆ పిల్లాడికి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ క్లాసులు చెబితే.. ఏది కరెక్ట్ ఏది తప్పు అని సంశయంలో పడతాడు. మంచి చెడు చెప్పాల్సిన తల్లిదండ్రులే ఇలాంటి పనులు చేస్తుంటే చూస్తూ ఉండటం సరైన పద్ధతి కాదని, ఇది అతని భవిష్యత్ పై ప్రభావం చూపుతుందంటూ చిన్మయి స్పష్టం చేసింది. చిన్మయి పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా, ఈ పోస్ట్‌పై అనసూయ ఎలా స్పందిస్తుందా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా గమనిస్తున్నారు. కాగా, అనసూయ రీసెంట్‌గా విజయ్ దేవరకొండ ప్రవర్తనపై స్టన్నింగ్ కామెంట్స్ చేసి వార్తలలో నిలిచిన విషయం తెలిసిందే.
Someone posted on Insta#instareel #anasuya pic.twitter.com/0PhCwpu5V1
— your life (@you_bgm) July 27, 2024