Site icon vidhaatha

Chiranjeevi | ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి

విధాత : ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా చిరంజీవి ట్విటర్ ఎక్స్‌లో చేసిన పోస్టు వైరల్‌గా మారింది. కొందరి కీర్తి అజరామరం..తరతరాలు శాశ్వతం.. భావితరాలకు ఆదర్శం.

నందమూరి తారక రామారావుని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను” అని చిరంజీవి తన ట్విట్‌లో పేర్కోన్నారు. ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలన్న చిరంజీవి అభ్యర్థన పట్ల నెటిజన్ల నుంచి భారీ మద్దతు లభిస్తుంది.

Exit mobile version