Deepika Padukone| దీపికా ప‌దుకొనేది ఫేక్ బేబి బంపా.. స‌రోగ‌సి ద్వారా పిల్ల‌ల్ని క‌న‌బోతుందా?

Deepika Padukone| క‌ల్కి చిత్రంలో సుమ‌తి పాత్ర పోషించిన దీపికా ప‌దుకొణే ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీ హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రంలో గ్లామ‌ర్ పాత్ర‌లో కాకుండా కీ రోల్‌లో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది. కాంప్లెక్స్ లో చిక్కుకుపోయి గర్భం దాల్చే యువతిగా దీపికా న‌టించి అందరి ప్ర‌శంస‌లు అందుకుం

  • Publish Date - July 3, 2024 / 03:09 PM IST

Deepika Padukone| క‌ల్కి చిత్రంలో సుమ‌తి పాత్ర పోషించిన దీపికా ప‌దుకొణే ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీ హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రంలో గ్లామ‌ర్ పాత్ర‌లో కాకుండా కీ రోల్‌లో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది. కాంప్లెక్స్ లో చిక్కుకుపోయి గర్భం దాల్చే యువతిగా దీపికా న‌టించి అందరి ప్ర‌శంస‌లు అందుకుంది. సినిమా ఎక్కువ భాగం ఆమె చుట్టూనే తిరుగుతుండ‌డం విశేషం. ఇందులో డీ గ్లామ‌రస్‌గా, గ‌ర్భ‌వ‌తిగా న‌టించి అద‌రహో అనిపించింది. అయితే క‌ల్కి సినిమాలో గ‌ర్భ‌వ‌తిగా క‌నిపించిన దీపికా ప‌దుకొణే రియ‌ల్ లైఫ్‌లో కూడా గ‌ర్భ‌వ‌తి అనే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్ స‌మ‌యంలో బేబి బంప్‌తోనే దీపికా ప‌దుకొనే క‌నిపించి అందరిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.

అయితే బేబీ బంప్ తో ఉన్నదీపికా ప‌దుకొణే కంఫర్ట్ లేని ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకోవడం… దాంతో పాటు గర్భవతిగా ఉండి కూడా హై హీల్స్ తో తిరుగుతుండ‌డం అంద‌రిలో అనేక అనుమానాలు క‌లిగిస్తుంది. ఈ విషయంల్ IVF నిపుణురాలు డా. గౌరీ అగర్వాల్ కూడా అనుమానం వ్యక్తం చేసింది. రోజూ ఆమె బేబీ బంప్స్‌తో కూడిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది కాని, అది నిజ‌మైన‌దా లేక కృతి బేబి బంపా అనేది అనుమానంగా ఉంద‌ని పేర్కొంది. ఫేక్ బేబీ బంప్ అవ్వడానికే ఎక్కవు అవకాశాలు ఉన్నాయ అంటున్నారు గౌరీ అగర్వాల్‌. దాని కారణం దీపిక పొట్ట గర్భిణీ పొట్టలా లేదని ఆమె చెబుతుంది. సాధార‌ణంగా గ‌ర్భం దాల్చితే శ‌రీరంలో కొవ్వు శాతం స‌హ‌జంగా పెరుగుతుంది. ముఖ ల‌క్ష‌ణాలు కూడా మారిపోతుంటాయి. అందుకే స‌రోగ‌సిని చాలా మంది హీరోయిన్స్ ఆశ్ర‌యిస్తారు.

అయితే దీపికాని చూస్తుంటే ఆమె స‌రోగ‌సి ద్వారా పిల్ల‌ల‌ని కంటుందని చెబుతున్నారు. ఆమె ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనబోదుంతా లేదా అనే దాని గురించి అంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. దీపికాది ఫేక్ బేబి బంప్ అని కూడా కొంద‌రు బ‌ల్ల‌గుద్ది చెబుతున్నారు. మ‌రి దీపికా దీనిపై ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి. ఇక ఇదిలా ఉంటే 25 జూలై 2019న ఇటలీలోని లేక్ కోమోలో ర‌ణ్‌వీర్, దీపికా వివాహం చేసుకున్నారు. పెళ్లయి దాదాపు 5 ఏళ్ల తర్వాత వారు తమ మొదటి బిడ్డకు స్వాగతం చెప్పబోతున్నారు. దీపిక తన మొదటి బిడ్డను బెంగుళూరులో కనబోతున్నట్టు తెలుస్తోంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన దీపికా.. మంగళూరులో జన్మించింది. కాగా ఆమె తల్లీ తండ్రులు బెంగుళూరులో ఉండటంతో.. అక్కడే పురుడు పోసుకోనుంద‌ని స‌మాచారం.

Latest News