Deepika Padukone | మరో ఘనత సాధించిన బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణే..!

Deepika Padukone | బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణే మరో ఘనతను సొంతం చేసుకున్నది. సినీరంగంలోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తున్నా ఇంకా అగ్రహీరోయిన్‌గా కొనసాగుతున్నది. అదే సమయంలో బాలీవుడ్‌ అగ్రహీరోలను తోసిరాజని ఈ హాట్‌ బ్యూటీ ఐఎండీబీ టాప్‌-100 భారతీయ సెలబ్రిటీల జాబితాలో నెంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకున్నది.

  • Publish Date - May 30, 2024 / 08:09 AM IST

Deepika Padukone | బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణే మరో ఘనతను సొంతం చేసుకున్నది. సినీరంగంలోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తున్నా ఇంకా అగ్రహీరోయిన్‌గా కొనసాగుతున్నది. అదే సమయంలో బాలీవుడ్‌ అగ్రహీరోలను తోసిరాజని ఈ హాట్‌ బ్యూటీ ఐఎండీబీ టాప్‌-100 భారతీయ సెలబ్రిటీల జాబితాలో నెంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకున్నది. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ను దీపికా తర్వాతి స్థానాల్లో ఉండడం విశేషం. ఏప్రిల్‌ 2014 నుంచి ఏప్రిల్‌ 2024 వరకు ఐఎండీబీ వెబ్‌సైట్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన ప్రముఖుల ప్రొఫైల్‌ ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.

ఐఎండీబీ వెబ్‌సైట్‌లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో పాటు సెలబ్రిటీల ప్రొఫైల్స్‌ సైతం ఉంటాయి. ఇందులో ఈ హాట్‌ బ్యూటీ గురించే ఎక్కువ సెర్చ్‌ చేయగా.. తొలి స్థానం దక్కించుకున్నది. ఇక రెండో స్థానంలో షారుఖ్‌ ఖాన్‌, మూడోస్థానంలో ఐశ్వర్య బచ్చన్‌, 4వ స్థానంలో అలియా భట్‌, ఐదో స్థానంలో ఇర్ఫాన్‌ఖాన్‌, 6వ స్థానంలో అమిర్‌ఖాన్‌, 7వ స్థానంలో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, 8వ స్థానంలో సల్మాన్‌ ఖాన్‌, 9వ స్థానంలో హృతిక్‌ రోషన్‌, 10వ స్థానంలో అక్షయ్‌ కుమార్‌ ఉన్నారు. టాలీవుడ్‌ బ్యూటీ సమంత 13వ స్థానంలో ఉండగా.. కేజీఎఫ్‌ స్టార్‌ యశ్‌ 89వ ర్యాక్‌లో ఉన్నాడు.

Latest News