Janhvi Kapoor | జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషనల్‌లో వచ్చిన మూవీ దేవర. ఇంతకు ముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ మంచి హిట్‌ని సాధించింది. ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన దేవర మూవీపై సైతం మంచి బజ్ ఏర్పడింది. పాన్ ఇండియా లెవల్‌లో వచ్చిన మూవీ ఈ నెల 27న థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాలతో విదేశాల్లోనూ మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్నది. ఈ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఎన్టీఆర్‌కు జోడీగా తంగం పాత్రలో నటించింది.
శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తొలిసారిగా తెలుగు తెరపై కనిపించింది. అయితే, మూవీలో జాన్వీ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యం లేదని.. క్యారెక్టరైజేషన్ సైతం సరిగా లేదని విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం జాన్వీని అందాల ప్రదర్శనకే పరిమితం చేశారని టాక్ వినిపిస్తున్నది. సినీరంగ ప్రవేశం చేసిన చాలారోజుల తర్వాత టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడం, ఎన్టీఆర్ సినిమాలో నటిస్తుండడంతో ఆమె పాత్ర ఆకట్టుకునేలా ఉంటుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. వాస్తవానికి ఒక్క చుట్టమల్లే పాటలో తప్పిస్తే మిగతా అంతా పది నిమిషాలు తప్పిస్తే మిగతా రన్ టైంలో జాన్వీ పాత్ర కనిపించలేదని కామెంట్స్ వస్తున్నాయి. సినిమాలో జాన్వీది గెస్ట్‌రోల్ కాదు కదా? అంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై జాన్వీ కపూర్ సినిమాల్లో నటించే ముందు పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక జాన్వీ కపూర్ పాత్రకు దేవర-2లోనైనా ప్రాధాన్యం ఉంటుందా? లేదా? వేచి చూడాల్సిందే. త్వరలోనే జాన్వీ కపూర్ ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా మూవీ తెరకెక్కనున్నది. ఈ మూవీలో జాన్వీ కపూర్ నటించనున్నది. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో సినిమా మొదలైంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నది. దేవరలో జాన్వీకి పెద్దగా స్క్రీన్ టైమ్ దొరకలేదు. ఉన్న సీన్స్‌లో నటనకు పెద్దగా స్కోప్ లేదు. ఈ క్రమంలో రామ్ చరణ్ మూవీలోనైనా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర నటించాలని జాన్వీ అభిమానులు కోరుకుంటున్నారు.