Site icon vidhaatha

Dil Raju| దిల్ రాజు సింగ‌ర్ అన్న విష‌యం తెలుసా.. ఆయ‌న పాడిన పాట యూత్‌లో అంతగా నానిందా..!

Dil Raju| దిల్ రాజు.. ఇత‌ను హీరో కాదు, క‌మెడీయ‌న్ కాదు, ప్ర‌ముఖ విల‌న్ కాదు. ఒక నిర్మాత మాత్ర‌మే. అయితే హీరోల‌ని మించిన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. దిల్ రాజు సినిమా తీస్తున్నాడంటే అది ప‌క్కా హిట్ అనే అభిప్రాయం అంద‌రిలో ఉంటుంది. దిల్ రాజు చేసే సినిమాల్లో దాదాపు 90 శాతం సక్సెస్ అవుతుంటాయి. అయితే ఈ మధ్యే దిల్ రాజు సినిమాలు మిశ్రమ ఫలితాన్ని అందుకున్నాయి. కానీ మళ్లీ దిల్ రాజు మునుపటిలా బ్లాక్ బస్టర్లు కొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇటీవ‌ల దిల్ రాజు ప్రొడక్షన్ లో విడుదలైన ఫ్యామిలీ స్టార్ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డింది. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్న గేమ్ ఛేంజ‌ర్‌పైన బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకున్నాడు.

దిల్ రాజు ప‌ర్స‌న‌ల్ విష‌యానికి వ‌స్తే.. దిల్‌ రాజు మొదటి భార్య అనిత 2018లో గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత ఆయన 2020 లాక్‌డౌన్‌లో తేజస్వీని సీక్రెట్‌గా రెండో పెళ్లీ చేసుకున్నారు. వీరికి 29 జూన్‌ 2022ను కుమారుడు అన్వి రెడ్డి జన్మించాడు. కెరీర్‌లో బిజీగా ఉండే దిల్ రాజు ఫ్యామిలీతో ఇటీవ‌ల వెకేష‌న్‌కి వెళుతున్నాడు. అమెరికాలో దిల్ రాజు త‌న భార్య‌తో క‌లిసి చేసిన ఫొటో షూట్ ఆక‌ట్టుకుంటుంది. జీన్స్ షర్ట్ అండ్ షార్ట్ లో దిల్ రాజు, వైట్ కలర్ లాంగ్ డ్రెస్ లో తేజస్విని చూడముచ్చటగా కనిపించారు. మీరు ఇద్ద‌రు క‌లిసి ఓ సినిమా చేయోచ్చుగా అంటూ కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. మరోవైపు, దిల్ రాజు నిర్మాణంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, నితిన్ తమ్ముడు సినిమాలు ఉన్నాయి.

అయితే దిల్ రాజు మ‌ల్టీ టాలెంట్‌కి సంబంధించిన వార్త ఒక‌టి ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. దిల్ రాజు… శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై నిర్మాతగా సినిమాలు నిర్మించడమే కాదు.. సింగర్ గా సినిమాల్లో పాటలు కూడా పడతారు.. నాగ చైత‌న్య హీరోగా తెర‌కెక్కిన జోష్ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ‘అన్నయ్య వచ్చినాడో.. వెలుగుల వెన్నెల తెచ్చినాడో’ అనే సాంగ్ ట్యూన్ ఫైనల్ చేశాకా లిరిక్స్ తో దిల్ రాజు హమ్ చేస్తూ దర్శకుడు వాసువర్మకి కనిపించారు. దిల్ రాజు బాగా హ‌మ్ చేయ‌డం గ‌మ‌నించిన ద‌ర్శ‌కుడు ఆయ‌న‌తోనే పాడించాలంటూ ప‌ట్టుబ‌ట్టాడు. అప్పుడు దిల్ రాజు త‌న గొంతులో ఆ పాట పాడి అంద‌రిని అలరించాడు. ఈ పాట అప్ప‌ట్లో కాలేజీ స్టూడెంట్స్ నోటిలో తెగ వినిపించింది. స్వతహాగా దిల్ రాజుకి సంగీతం పై మంచి అభిరుచి ఉండ‌డంతో తన ప్రతి సినిమాలోని సాంగ్స్ ని లిరిక్స్ తో సహా ఆయనే ఫైనల్ చేస్తార‌నే టాక్ కూడా ఉంది.

Exit mobile version