ముంబైలో ఆమిర్‌ఖాన్‌ కొత్త అపార్ట్‌మెంట్ రేటెంతో తెలుసా? యూపీలోనూ 22 ఇళ్లు!

సినీనటుల ఇళ్ల కొనుగోళ్లు ఎప్పుడైనా హాట్‌ టాపిక్‌గానే ఉంటాయి. ఇలాంటివారి జాబితాలో బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌ కూడా ఒకరు. తాజాగా తన రియల్‌ఎస్టేట్‌ పోర్టుఫోలియో జాబితాలో మరో ఇంటిని ఆమిర్‌ఖాన్‌ జత చేశాడు

  • Publish Date - June 27, 2024 / 07:09 PM IST

ముంబై: సినీనటుల ఇళ్ల కొనుగోళ్లు ఎప్పుడైనా హాట్‌ టాపిక్‌గానే ఉంటాయి. ఇలాంటివారి జాబితాలో బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌ కూడా ఒకరు. తాజాగా తన రియల్‌ఎస్టేట్‌ పోర్టుఫోలియో జాబితాలో మరో ఇంటిని ఆమిర్‌ఖాన్‌ జత చేశాడు. ముంబైలోని ఖరీదైన ప్రాంతంగా భావించే పలిహలి ఏరియాలో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను ఆమిర్‌ఖాన్‌ కొనుగోలు చేశారు. ఈ భారీ అపార్ట్‌మెంట్‌ను ఆమిర్‌ఖాన్‌ 9.75 కోట్లకు కొనుగోలు చేసినట్టు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తున్నది.ఈ కొత్త రెడీ టు మూవ్‌ అపార్ట్‌మెంట్‌.. 1027 చదరపు అడుగుల కార్పెట్‌ ఏరియాతో ఉన్నది. బదిలీ ఒప్పందం జూన్‌ 25న ఖరారైంది. దీనికి స్టాంప్‌డ్యూటీ 58.5 లక్షలు, రిజిస్ట్రేషన్‌ ఫీజు 30వేలు. భారీ భవంతులు ఉన్న ఈ ప్రాంతంలోని బెల్లా విస్టా అపార్ట్‌మెంట్స్‌కు ఇది దగ్గరలో ఉన్నది.

ఈ ప్రాంతం ముంబైలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదిగా భావిస్తారు. చక్కటి వాతావరణం, చూడచక్కని ల్యాండ్‌ స్కేప్స్‌తో ఉండే కారణంగా ఇక్కడ నివసించేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇప్పటికే ఆమిర్‌ఖాన్‌కు బెల్లాబిస్టా అపార్ట్‌మెంట్‌తోపాటు.. పాలి హిల్స్‌లోని మెరీనా అపార్ట్‌మెంట్స్‌లోనూ పలు ఆస్తులు ఉన్నాయి. ఈ రెండింటినీ తిరిగి అభివృద్ధి చేయనున్నారు.బాంద్రాలో సముద్రానికి అభిముఖంగా ఐదు వేల చదరపు అడుగుల భారీ భవంతి ఆమిర్‌ఖాన్‌కు ఉన్నది. ఇది రెండంతస్తుల భవనం. చాలా తక్కువ ఇంటీరియర్‌తో ఉండే ఈ నివాసంలో పార్టీలు, గెట్‌టుగెదర్‌లు నిర్వహించేందుకు ఇక్కడ భారీ ఓపెన్‌ ఏరియా కూడా ఉన్నది.2013లో పంచ్‌గనిలో రెండెకరాల విస్తీర్ణం కలిగి ఉన్న ఫామ్‌హౌస్‌ను ఆమిర్‌ఖాన్‌ 7 కోట్లకు ఖరీదు చేశాడు. కమర్షియల్‌ ఆస్తుల విషయంలోనూ ఆమిర్‌ఖాన్‌ భారీగా పెట్టుబడులు పెట్టినట్టు చెబుతుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లా షాహాబాద్‌లో ఆయనకు 22 ఇళ్లు ఉన్నట్టు ప్రచారంలో ఉంది.

Latest News