KALKI 2898 AD| క‌ల్కిలో కృష్ణుడిగా న‌టించిన ఇత‌నెవరో గుర్తు ప‌ట్టారా.. అత‌నికి వాయిస్ ఇచ్చింది కూడా ఫేమ‌స్ న‌టుడే..!

KALKI 2898 AD| ప్ర‌భాస్, దీపికా ప‌దుకొణే, అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన చిత్రం క‌ల్కి 2898 ఏడి. మహాభారతంలోని కొన్ని అంశాలను తీసుకుని దాని చుట్టూ అల్లుకున్న కథతో దర్శకుడు నాగ్​ అశ్విన్​ ఈ చిత్రాన్ని అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించారు. మూవీకి అన్ని వ‌ర్గాల

  • Publish Date - June 28, 2024 / 12:45 PM IST

KALKI 2898 AD| ప్ర‌భాస్, దీపికా ప‌దుకొణే, అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన చిత్రం క‌ల్కి 2898 ఏడి. మహాభారతంలోని కొన్ని అంశాలను తీసుకుని దాని చుట్టూ అల్లుకున్న కథతో దర్శకుడు నాగ్​ అశ్విన్​ ఈ చిత్రాన్ని అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించారు. మూవీకి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. సౌతిండియా, నార్తిండియాలోనే కాదు ఓవర్సీస్​లోనూ ఇదే రేంజ్​లో ప్రీ సేల్స్​ను జరుపుకుని భారీ వసూళ్లను అందుకుంది. దీంతో ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్ బోర్డులే క‌నిపిస్తున్నాయి. చూస్తుంటే మ‌రో మూడు నాలుగు రోజుల పాటు ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసేలా క‌నిపిస్తుంది.

నాగ్ అశ్విన్ క్రియేట్ చేసిన ఈ విజువల్ వండర్ లో కురుక్షేత్ర యుద్ధంలో కొన్ని సీన్స్ ని చూపించారు. కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, ఉత్తర, అశ్వత్థామ పాత్రలను ప‌రిచ‌యం చేయ‌గా, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ , కర్ణుడిగా ప్రభాస్, ఉత్తరగా మాళవిక నాయర్, అర్జునుడిగా విజయ్ దేవరకొండ న‌టించి మెప్పించారు.. ఇక కృష్ణుడిగా నటించిన వ్య‌క్తి ఫేస్ రివీల్ చేయ‌లేదు. అంద‌రు అత‌ని బాడీ లాంగ్వేజ్‌ని బ‌ట్టి హీరో నాని అనుకున్నారు. కాని కృష్ణుడి పాత్ర పోషించిన న‌టుడు త‌న సోష‌ల్ మీడియా ద్వారా క‌ల్కి సినిమాలో త‌ను కృష్ణుడి పాత్ర పోషించిన‌ట్టు తెలియ‌జేశారు. క‌ల్కి చిత్రంలో కృష్ణుడి పాత్ర పోషించే అవ‌కాశం త‌న‌కు ద‌క్క‌డం చాలా గొప్ప అదృష్టం అని త‌మిళ న‌టుడు కృష్ణ కుమార్‌ (కేకే) తెలియ‌జేశారు.

కేకే.. సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన డబ్బింగ్‌ చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’తో పలకరించారు. ఈ మూవీలో సూర్యకు స్నేహితుడిగా కేకే నటించారు. ధనుష్‌ ‘మారన్‌’ ‘కాదళగి’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో కూడా న‌టించారు. ఇక అత‌ని పాత్ర‌కి డ‌బ్బింగ్ చెప్పింది మ‌రెవ‌రో కాదు..ట్యాలెంటెడ్ యాక్ట‌ర్ అర్జున్ దాస్. మంచి బేస్ వాయిస్ ఉన్న ఈ యాక్ట‌ర్ ఖైదీ, మాస్ట‌ర్, విక్ర‌మ్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు క‌ల్కి మూవీలోని శ్రీ‌కృష్ణుడి పాత్ర‌కు అర్జున్ దాస్ వాయిస్ ఇచ్చాడ‌ని తెలిసి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అత‌నిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Latest News