విధాత : దుల్కర్ సల్మాన్ , భాగ్యశ్రీ బోర్సే , సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘కాంత’ ట్రైలర్ విడుదకు ముందు మేకర్స్ లాంచింగ్ వీడియో ఒకటి విడుదల చేశారు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో వస్తున్న ‘కాంత’ సినిమా ట్రైలర్ ఈ నెల 6న రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ కు ముందుగా విడుదల చేసిన ట్రైలర్ లాంచింగ్ వీడియో రానున్న ట్రైలర్ పైన, సినిమాపై ఆసక్తిని పెంచింది.
ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్‌లతో రానా, దుల్కర్ సల్మాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాంత మూవీ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1950 మద్రాస్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన పోస్టర్, టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.
