Nampally Court : కోర్టుకు రావాల్సిందే..నటులు వెంకటేష్, రానాలకు కోర్టు షాక్

ఫిల్మ్‌నగర్ డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో సినీ నటులు వెంకటేశ్, రానా, అభిరామ్, సురేశ్ బాబులకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. నవంబర్ 14న పర్సనల్ బాండ్‌ సమర్పించడానికి కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించింది.

Case booked against actors Venkatesh, Rana and family over demolition of hotel

విధాత, హైదరాబాద్ : సినీ నటులు దగ్గుబాటి వెంకటేశ్‌, రానా, అభిరామ్, సురేశ్‌ బాబులకు నాంపల్లి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో వీరంతా తప్పనిసరిగా నవంబర్ 14న న్యాయస్థానానికి హాజరు కావాలని ఆదేశించింది. పర్సనల్ బాండ్ సమర్పించేందుకు కచ్చితంగా కోర్టుకు రావాలని స్పష్టం చేసింది.

కోర్టు ఆదేశాలను ధిక్కరించి డెక్కన్ హోటల్ కూల్చివేశారన్న ఆరోపణలను వారు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంలో గతంలో నమోదైన కేసుపై గురువారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం కోర్టు వెంకటేశ్‌, రానా, అభిరామ్, సురేశ్‌ బాబులు కోర్టుకు స్వయంగా రావాలని ఆదేశించింది.