NTV journalists bail| ఆ జర్నలిస్టులకు బెయిల్ మంజూరు

మహిళా ఐఏఎస్ అధికారులు..మంత్రులపై అభ్యంతరకర వార్త కథనాల కేసులో అరెస్టయిన ఎన్టీవీ జర్నలిస్టులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్ లకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం..వారిని పాస్‌పోర్టులను సరెండర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రూ. 20 వేల నగదు, రెండు పూచీకత్తులతో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

విధాత, హైదరాబాద్ : మహిళా ఐఏఎస్ అధికారులు..మంత్రులపై అభ్యంతరకర వార్త కథనాల కేసులో అరెస్టయిన ఎన్టీవీ జర్నలిస్టులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేష్, సుధీర్ లకు బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం..వారిని పాస్‌పోర్టులను సరెండర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
రూ. 20 వేల నగదు, రెండు పూచీకత్తులతో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ విడిచి వెళ్లవద్దని ఆదేశించింది. పోలీసులు ఈ కేసులో బాధితులుగా పేర్కొంటున్న వారిలో ఎవ్వరూ ముందుకు వచ్చి స్టేట్మెంట్ నమోదు చేయలేదని కోర్టుకు వివరించారు. బాధితుల పేర్లు లేదా వారి స్టేట్మెంట్లు సమర్పించాలని కోర్టు ఆదేశించగా..స్టేట్మెంట్ ఇవ్వడానికి బాధితులు ఆసక్తి చూపలేదని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది.దీంతో సీసీఎస్ పోలీసుల వాదనను తప్పుబట్టిన న్యాయస్థానం బాధిత జర్నలిస్టులకు బెయిల్ మంజూరు చేసింది.

దొంతు రమేష్,సుధీర్‌లపై బీఎన్ఎస్ సెక్షన్స్ 75, 78, 79, 351(1), 352, 61(2), 238.. ఐటీ యాక్ట్‌లోని 67 సెక్షన్.. ది ఇండీసెంట్ రిప్రెజెంటేషన్ ఆఫ్ వుమెన్ యాక్ట్ 1986లోని సెక్షన్స్ 3&4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసుతో మాకు ఎలాంటి సంబంధం లేదు : దొంతు రమేష్

మహిళా ఐఏఎస్ అధికారులు..మంత్రులపై అభ్యంతరకర వార్త కథనాల కేసులో న్యాయం గెలిచిందని..మాకు కోర్టు బెయిల్ మంజూరు చేసిందని జర్నలిస్టు దొంతు రమేష్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుండి యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్టు చేశారేమో కానీ ఇప్పటివరకు ఎప్పుడు వర్కింగ్ జర్నలిస్టులను అరెస్టు చేయలేదు అని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులను చేయని తప్పుకు అరెస్టు చేసి మానసిక శోభకి గురి చేశారని రమేష్ ఆరోపించారు. మా మీద సిట్ వేశారు.. ఇది ఏమైనా అంతర్జాతీయ నేరమా లేక ఉగ్రవాద కోణమా ?
మా మీద సెక్షన్లు ఎందుకు పెడుతున్నారు ఎప్పుడు పెడుతున్నారో కూడా మాకు తెలియదు అని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

అటు జర్నలిస్టులు సుధీర్ కూడా మాకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేనప్పటికీ పోలీసులు మా మీద అక్రమంగా, అన్యాయంగా కేసు పెట్టి వేధించారని వాపోయారు. పోలీసులు ముందే ప్రీ ప్లాన్ గా ఒక స్క్రిప్ట్ రాసుకొని దాని ప్రకారమే మమ్మల్ని విచారణలో ప్రశ్నలు అడిగారు అని, ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఎక్కడా కూడా మేము వార్త ప్రసారాలు చేయలేదు అన్నారు.

యాంకర్ దేవి విడుదల చేసిన వీడియోలో పోలీసులు విచారణలో తనను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. పై నుంచి వచ్చిన వార్తనే నేను చదివానని, వృత్తి ధర్మం పాటించడమే నేను చేసిన తప్పా? అని ప్రశ్నించారు. యాజమాన్యం క్షమాపణలు చెప్పినా నన్ను పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు అని, మా ఇంటికొచ్చి నా భర్తతో మాట్లాడి వాళ్లని కూడా ఇబ్బంది పెట్టారు అని, మూడు గంటల పాటు మెంటల్ టార్చర్ చేస్తూ ప్రశ్నలు అడిగినా..నేను సమాధానం ఇచ్చాను అని యాంకర్ దేవి స్పష్టం చేశారు.

Latest News