Horoscope | శుక్ర‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ప‌ట్టింద‌ల్లా బంగార‌మే..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కీలక వ్యవహారాల్లో మీ వినూత్న ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటాయి. లక్ష్మీ దేవి ఈ రోజు విశేషంగా అనుగ్రహిస్తుంది. వ్యాపారంలో ధనలాభాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో స్వల్ప వివాదాలు ఉండవచ్చు.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కొన్ని సంఘటనలు విచారం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ ఖర్చులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో తొందరపడకుండా నిదానంతో వ్యవహరించాలి. చంచల బుద్ధితో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో కోపావేశాలు అదుపులో ఉంచుకుని శాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున ముఖ్యమైన పనులు ఈ రోజు ప్రారంభించడానికి అనువుగా ఉంది.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆనందదాయకంగా గడిచిపోతుంది. అన్ని రంగాల వారు వృత్తి పరమైన శుభవార్తలు వింటారు. ఆదాయం పెరగడంతో సంతోషంగా ఉంటారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది. బంధువుల నుంచి అందిన ఒక శుభవార్తతో మీ ఆనందం రెట్టింపు అవుతుంది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగులు అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో పటిష్టమైన ప్రణాళిక అవసరం. అనవసర ఖర్చులు తగ్గించండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతాయి. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఎరపడతాయి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. లక్ష్మీ దేవి అనుగ్రహంతో ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించిన దానికన్నా అధిక ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢ పడుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. శ్రేష్టమైన శుభకాలం నడుస్తోంది. ముఖ్యమైన పనులు ప్రారంభిస్తారు. ఆర్థికంగా అనుకూలమైన సమయం. ఆదాయం పెరగడం, ఖర్చులు తగ్గడం ఆనందం కలిగిస్తుంది. పిత్రార్జితం ద్వారా లాభపడతారు. అవివాహితులకు వివాహయోగం ఉంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో ఎన్ని ఆటంకాలు వచ్చిన పట్టుదలతో అధిగమిస్తారు. వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి పరంగా చేసే ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో బద్దకాన్ని విడిచి చురుగ్గా పనిచేస్తే ఆశించిన ఫలితాలు అందుకోవచ్చు. గిట్టనివారు నుంచి అపాయం ఉండవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండండి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆదాయవ్యయాలు సమానంగా ఉంటాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా శ్రమ, ఒత్తిడి ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో మనోధైర్యంతో విజయం సాధిస్తారు. పెరిగే ఖర్చులు ఒత్తిడి కలిగిస్తాయి. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అవసరం. చట్టవిరుద్దమైన పనులు చేయవద్దు. మీ మాటతీరుతో ఇతరులు భాధపడే అవకాశం వుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. గ్రహగతులు అనుకూలంగా ఉన్నందున పట్టిందల్లా బంగారం అవుతుంది. కళారంగంలో వారికి అన్ని రకాల అభివృద్ధి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. మీరు సాధించిన విజయం మీకు గుర్తింపు తెస్తుంది. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. కుటుంబంలో ఆనందకరమైన సంఘటనలు జరుగుతాయి.

Latest News