విధాత, హైదరాబాద్ : చట్టం, కోర్టుల విచారణ అంశాలలో సామాన్యులకు ఒక న్యాయం, సెలబ్రిటీలకు మరో న్యాయం ఉంటుందా అని టాలీవుడ్ ప్రముఖులు దగ్గుబాటి వెంకటేశ్, రానా, నిర్మాత సురేశ్ బాబు, అభిరామ్ లపై నాంపల్లి కోర్టు న్యాయమూర్తి మండిపడ్డారు. కోర్టుకు హాజరుకాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ తప్పదని వార్నింగ్ ఇచ్చారు. దక్కన్ కిచెన్ హోటల్ కేసు విచారణ సందర్భంగా దగ్గుబాటి బ్రదర్స్ పై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు కోర్టు ఆర్డర్స్ ను ధిక్కరిస్తారంటూ ప్రశ్నించారు. దగ్గుబాటి వెంకటేశ్, రానా, నిర్మాత సురేశ్ బాబు, అభిరామ్ కోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.
దక్కన్ కిచెన్ హోటల్ ను జీహెచ్ఎంసీ సిబ్బంది, దగ్గుబాటి ఫ్యామిలీ తో పాటు కొందరు బౌన్సర్లు కలిసి 2022 నవంబర్ 13న అక్రమంగా కూల్చివేయడంతో పాటు అక్కడ వున్న సామగ్రిని దొంగలించారని హోటల్ యజమాని నందకుమార్ 2024 జనవరిలో నాంపల్లి కోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై నాంపల్లి కోర్టు సమగ్ర విచారణ జరిపి కోర్టు స్వయంగా దగ్గుబాటి ఫ్యామిలీపై కేసు నమోదు చేయడం జరిగింది.
అయితే దగ్గుబాటి బ్రదర్స్ కోర్టు కేసుని లెక్కచేయకుండా మరోసారి 2024 మార్చిలో నందుకుమార్ హోటల్ బిల్డింగ్ ని భారీ సంఖ్య లో వ్యక్తిగత బౌన్సర్ లను వినియోగించి పూర్తిగా నేలమట్టం చేశారు.హోటల్ లో వున్న కోట్ల విలువ చేసే సామగ్రి ని దొంగతనం చేశారు. దీనిపై నందకుమార్ మరోసారి ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ లో దగ్గుబాటి ఫ్యామిలీ పై ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో నందకుమార్ మరో మారు నాంపల్లి కోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై కోర్టు స్పందిస్తూ జనవరి 2025 లో కేసు నమోదు చేయవలసినది గా పోలీస్ లని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఫిల్మ్ నగర్ పోలీస్ లు మరోసారి కేసు నమోదు చేశారు. గత పది నెలలుగా ఈ కేసుపై ఎలాంటి విచారణ జరపకుండా ఫిల్మ్ నగర్ పోలీస్ లు కాలయాపన చేస్తుండటం..కోర్టు విచారణకు దగ్గుబాటి బ్రదర్స్ హాజరుకాకపోవడంతో నాంపల్లి కోర్టు వారి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు హాజరుకావాలని లేదంటే నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి :
Train Rams Truck | రైల్వే క్రాసింగ్ వద్ద లారీని ఢీకొట్టిన రైలు.. షాకింగ్ వీడియో
Mahesh Babu | స్టార్‌డమ్‌కు అతీతంగా స్నేహం.. పవన్ కళ్యాణ్ సినిమాకు ఫ్రీగా వాయిస్ ఇచ్చిన మహేష్ బాబు
