Konda Surekha| నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖ కేసు వాయిదా

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5 వ తేదీకి వాయిదా వేసింది.

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha)పై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసు(KTR defamation suit) విచారణను  నాంపల్లి( Nampally Court) ప్రజాప్రతినిధుల కోర్టు  ఫిబ్రవరి 5 వ తేదీకి వాయిదా వేసింది.

గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో సమంత, అక్కినేని నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని, సినిమా హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేశాడని కొండా సురేఖ ఆరోపించింది. ఆమె వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేటీఆర్ నాంపల్లి కోర్టులో అటు అక్కినేని నాగార్జున, ఇటు కేటీఆర్ ఇద్దరు కూడా పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అయితే ఇటీవల నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ పశ్చాతాపం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో నాగార్జున తన పిటిషన్‎ను ఉపసంహరించుకున్నారు. కేటీఆర్ వేసిన కేసును తాజాగా విచారించిన కోర్టు..తదుపరి విచారణనను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. గతంలో ఇదే కేసులో కొండా సురేఖపై కోర్టు క్రిమినల్ కేసు నమోదు చేయాలని అదేశించింది.

Latest News