కిమ్ మామా అలజడి: నార్త్ కొరియా బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం

ఉత్తర కొరియా జపాన్ సముద్రం వైపు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించడం ప్రపంచాన్ని కలవరపెట్టింది. మిడిల్ ఈస్ట్ యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది.

North korea ballistic missile

విధాత : ఓవైపు పశ్చిమాసియా యుద్ద కల్లోలం కొనసాగుతున్న క్రమంలో జపాన్‌ సముద్రంపైకి ఉత్తర కొరియాబాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం కలకలం రేపింది. ఉత్తర కొరియా 10 బాలిస్టిక్ మిస్సెల్స్ ను క్షిపణులను ప్రయోగించింది. జపాన్ సముద్రం వైపు బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించిందని దక్షిణ కొరియా, జపాన్ ధృవీకరించాయి. జపాన్ సముద్రంలో ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి కూలింది.

మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ తో ఇజ్రాయెల్, అమెరికా యుద్దం 15వ రోజుకు చేరుకున్న క్రమంలో నార్త్ కొరియా బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించడం ప్రపంచ దేశాలను కలవరపెట్టింది. అయితే అమెరికా, దక్షిణ కొరియా మిలటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్న క్రమంలో ఈ అంశాన్ని సాకుగా చూపించి ఉత్తర కొరియా ఇలా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలు చేస్తుండటం గమనార్హం. వారం క్రితం కూడా ఉత్తర కొరియాఓ యుద్ధనౌక నుంచి తన తీరానికి సమీపంలోని దీవులపై క్రూజ్‌ క్షిపణులను ప్రయోగించింది. ఆ ప్రయోగ పరీక్షలను ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్, తన 13 ఏళ్ల కుమార్తె కిమ్‌ జు యేతో కలిసి కాన్ఫరెన్స్‌ హాలులో కూర్చుని వీక్షించడం వైరల్ గా మారింది. తమ దేశంపై అణ్వస్త్ర దాడి ముప్పును నిరోధించడానికే ఈ శక్తిమంతమైన క్షిపణులతో ప్రయోగాలు చేస్తున్నట్లు కిమ్‌ ఇప్పటికే ప్రకటించారు.

దక్షిణ కొరియా, అమెరికా మిలటరీ డ్రిల్స్ తో మొదలైన అనుమానాలు

ఉత్తర కొరియా నుంచి బెదిరింపులు వ్యక్తమవుతున్న క్రమంలో పూర్తిగా స్వీయ రక్షణ కోసం ఐదు రోజుల క్రితం సియోల్, వాషింగ్టన్ మిలటరీ కీలక మిలటరీ డ్రిల్ నిర్వహించాయి. ఉత్తర కొరియాతో 2019 నుంచి దక్షిణ కొరియాకు సంబంధాలు తెగిపోగా..రెండు పరస్పర శత్రు దేశాలుగా మారిపోయాయి. గత గురువారం దక్షిణ కొరియా ప్రధాన మంత్రికిమ్ మిన్ సియోక్ .. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో వాషింగ్టన్ లో సమావేశం అయ్యారు. ఈ భేటీతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అప్రమత్తమైనట్లుగా సమాచారం. అయితే దక్షిణ కొరియా ప్రధాన మంత్రి కిమ్ మిన్ సియోక్ మాట్లాడుతూ.. ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ ను త్వరలో ట్రంప్ కలువబోతున్నట్లుగా చెప్పడం ఆసక్తికరం. ఏప్రిల్లో ట్రంప్ బీజింగ్ పర్యటన ఉంది. ఈ క్రమంలోనే కిమ్ జోంగ్ ఉన్ తో ట్రంప్ భేటీ కావాలని భావిస్తున్నారని, అయితే ఈ సందర్బంలోనే వారిద్దరి భేటీ ఉంటుందని చెప్పలేమని కిమ్ మిన్ సియోక్ తెలిపారు.

ఆయుధాల పెంపుపై కిమ్ జోంగ్

కొంతకాలంగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ తన దేశంలో ఆయుధాలు పెంచుకోవడంపై దృష్టిపెట్టాడు. ఇంతకాలం అణ్వాయుధాలపై దృష్టిపెట్టిన కిమ్.. ఇప్పుడు స్వల్ప, మధ్యస్థాయి ఆయుధాల తయారీపై దృష్టిసారించాడు. ఆధునిక ఆయుధాల్ని తయారు చేయాలని ఆయన నిర్ణయించాడు. తాజాగా దేశీయా పిస్టల్స్ ఫ్యాక్టరీ తయారు చేసిన అధునాతన లైట్ పిస్టల్స్ పరీక్షలో కిమ్ స్వయంగా కూతురు కిమ్ జు అయే తో పాటు పాల్గొన్నాడు. కిమ్,కూతురు కిమ్ జు ఇద్దరూ పిస్టల్స్ పరీక్షించారు. ఈ పిస్టల్స్‌ను అధ్యక్షుడు కిమ్ పరీక్షించి, అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ఉత్తర కొరియా సైన్యానికి ఈ ఫ్యాక్టరీ తయారు చేసే ఆయుధాలు ఎంతో కీలకం అని కిమ్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి :

దారుణం..పెళ్లికి నిరాకరించిన యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్!
Gas Shortage In India | గ్యాస్ కొరత వేళ..నాలుగు రకాల గ్యాస్ వైరల్ !

Latest News