విధాత : హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ‘కాంత’ మూవీ నుంచి మేకర్స్ లిరికల్ వీడియో విడుదల చేశారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రానా దగ్గుబాటితో కలిసి దుల్కర్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో దుల్కర్ సరసనా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుండగా, సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాంత.. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా మరో లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.
జాను చంథర్ మ్యూజిక్ తో ఈ వీడియో ఆకట్టుకుంది. మీలోని ఫైర్ ఇప్పుడు ర్యాగింగ్ సౌండ్‌ట్రాక్‌ను కలిగి ఉంది..రేంజ్ ఆఫ్ కాంత అనే క్యాప్షన్ తో హీరో రానా దగ్గుబాటి ఈ లిరికల్ వీడియోను విడుదల చేశారు. 1950నాటి సినిమా బ్యాక్ డ్రాప్ పిరియడిక్ సినిమాగా రాబోతున్న కాంత చిత్రంలో సినిమా సెట్ లో నటుల మధ్య మొదలైన ప్రేమ కథగా ఈ చిత్రం తెరకెక్కింది.
