Site icon vidhaatha

Extra Jabardasth| ఇక ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ లేన‌ట్టేనా.. క‌న్నీరు పెట్టుకున్న ర‌ష్మీ, ఖుష్బూ

Extra Jabardasth| బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌సందైన వినోదం పంచిన కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్. ద‌శాబ్ద కాలంగా ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ వ‌స్తున్న ఈ షో మంచి రేటింగ్‌తో దూసుకుపోతుంది. జ‌బ‌ర్ధ‌స్త్ అంటూ ముందుగా ఒక షోని ప్లాన్ చేసిన ఈటీవీ వారు త‌ర్వాత ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్‌ని తీసుకు వ‌చ్చారు. ఈ రెండింటికి మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది.ఇక ఈ షో ద్వారా చాలా మంది క‌మెడీయ‌న్స్ పరిచ‌యం అయ్యారు. అయితే ఇప్పుడు ఈషోకి ఎండ్ కార్డ్ ప‌డ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. గ‌త కొద్ది రోజులుగా జ‌బ‌ర్ధ‌స్త్ షోకి సంబంధించి ప‌లు వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. జబర్దస్త్, ఎక్ట్సా జబర్దస్త్ ల‌లో ఒక దాన్ని తీసేస్తున్నారని, ఆ స్థానంలో మరో షోని తీసుకురావాలనే ఆలోచనలో మల్లెమాల టీమ్ చేస్తున్నట్టు ప్ర‌చారం జ‌రిగింది.

ఆ ప్ర‌చారాన్ని ఇప్పుడు మ‌ల్లెమాల నిజం చేసింది. `ఎక్ట్స్రా జబర్దస్త్` షోని క్లోజ్‌ చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రాగా, అందులో ఆ విషయాన్ని తెలియజేసింది టీమ్‌. రామ్‌ ప్రసాద్‌ తన స్కిట్‌ ద్వారా ఈ విషయాన్ని కాస్త ఇన్‌డైరెక్ట్‌గా తెలియ‌జేశాడు. ఇక్కడ రెండు కంపెనీలున్నాయి. ఇప్పుడు రెండు కలిపి ఒక్కటి కాబోతుంది. ఒకటి మిస్‌ అవుతున్నందుకు బాధగా అనిపిస్తుంది. మొదట్నుంచి ఇందులోనే ఉన్నాను, అదే వెళ్లిపోతుండటంతో ఇప్పుడు చాలా బాధగా ఉందని రామ్‌ ప్రసాద్‌ ఎమోషనల్‌ అయ్యాడు. దీంతో అటు యాంకర్‌ రష్మి, నరేష్‌, కృష్ణభగవాన్‌, ఖుష్బూ ఇలా అంద‌రు క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఇకపై నుంచి జబర్దస్త్ షో మాత్రమే ఉంటుంది. ఎక్స్‌ట్రా మిస్ అవుతుందని ర‌ష్మీ తెలిపింది. అయితే ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ మిస్ అయిన కూడా జ‌బర్ధ‌స్త్ ఎక్స్‌ట్రా ఎన‌ర్జీతో రానుంద‌ని తెలియ‌జేశారు.

ఒక్క షోనే రెండు రోజులుగా ప్రసారం చేయబోతున్నట్టు అర్ధ‌మ‌వుతుంది. సాధార‌ణంగా గురువారం జబర్దస్త్, శుక్రవారం ఎక్స్ ట్రాజబర్దస్త్ ప్ర‌సారం అయ్యేది. కాని ఇప్పుడు శుక్రవారం, శనివారం జబర్దస్త్ ని ప్రసారం చేయబోతున్నట్టు యాంకర్‌ రష్మి చెప్పుకొచ్చింది. అంటే ఒకే షోని రెండు సగాలుగా డివైడ్ చేసి ఒక రోజు స‌గం, మరో సగం మరో రోజు ప్రసారం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైన కంటెస్టెంట్స్‌తో పాటు ఫ్యాన్స్‌కి కూడా ఇది గుండెప‌గిలే వార్త అని చెప్పాలి.

Exit mobile version