Site icon vidhaatha

Faima,Praveen| నన్ను ప్ర‌తీసారి బ్యాడ్ చేశాడు.. ప్ర‌వీణ్‌తో విడిపోవ‌డానికి కార‌ణ‌మిదేనన్న ఫైమా

Faima,Praveen| బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మంతో చాలా మంది వెలుగులోకి వ‌చ్చారు. వారిలో ఫైమా, ప్ర‌వీణ్ కూడా త‌మ ప‌ర్‌ఫార్మెన్స్‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. పటాస్ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకొని ఆ తర్వాత జబర్దస్త్ షోకి ఎంట్రీ ఇచ్చి సెల‌బ్రిటీలుగా మారారు. ప్ర‌వీణ్ సంగ‌తి ప‌క్క‌న పెడితే ఫైమా మాత్రం ఒక్కో మెట్టు ఎక్కుతూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ షోకి కూడా వెళ్లి అక్క‌డ మ‌గాళ్ల‌తో పోటీ ప‌డి చివ‌రికి వ‌ర‌కు నిలిచింది. లేడి క‌మెడీయ‌న్‌గా ఫైమాకి మంచి పేరు రాగా, ఆమెకి ఫాలోయింగ్ కూడా భారీగానే ఉంది. అయితే ఫైమా ప్రవీణ్ మధ్య ప్రేమ ఉందని వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ ఎన్నో వార్త‌లు వ‌స్తుండేవి. వాటిని వారిద్ద‌రు అంగీక‌రించిన సంద‌ర్భాలు కూడా లేక‌పోలేదు.

బిగ్ బాస్ షోకి వెళ్లిన స‌మ‌యంలో ప్ర‌వీణ్‌ని తన లవర్ గా చెప్పింది ఫైమా. ప్ర‌వీణ్ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని ప‌లు సంద‌ర్భాల‌లో ఆయ‌న ఆదుకున్నాడ‌ని కూడా వివ‌రించింది. ఇక ఫైమా లోప‌ల ఉన్న‌ప్పుడు ఆమె గెలుపుకోసం ప్రవీణ్ బ‌య‌ట‌నుండి బాగానే క‌ష్ట‌ప‌డ్డాడు.ఇక హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక ఆమెకి చైన్ కూడా ఒక‌టి గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే సవ్యంగా సాగుతున్న వీరు రిలేషన్ లో ఏదో స‌మ‌స్య రావ‌డం దాని వ‌ల‌న ప్ర‌వీణ్ ఫైమా బ్రేక‌ప్ చెప్పుకోవ‌డం జ‌రిగింది. గ‌త కొద్ది రోజులుగా వీరు క‌లిసి క‌నిపించింది లేదు. ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో ప్ర‌వీణ్ వారి బ్రేక‌ప్ గురించి కూడా స్పందిస్తూ… . ఆమె నన్ను వదిలేసింది. ఇప్పుడు వచ్చినా నేను త‌న‌తో క‌లిసి ప్ర‌యాణించేందుకు సిద్ధం అని అన్నాడు.

అయితే అస‌లు వారిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింది, విడిపోవ‌డానికి కార‌ణం ఏంట‌నే విషయంపై తొలిసారి ఫైమా నోరు విప్పింది. ఓ ఇంటర్వ్యూలో ఫైమా మాట్లాడుతూ.. ప్రవీణ్ నా మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని, అవి చెప్పుకోలేనివి అంటూ పేర్కొంది. ఆ స‌మ‌స్య‌ల వ‌ల్ల‌నే మేము ఇద్ద‌రం దూరం కావాల్సి వచ్చింది. ప్రవీణ్ కి పేరెంట్స్ లేరు. అతడు ఇంటర్వ్యూలలో చెప్పే కొన్ని మాటలు సింపథికీ దారితీస్తాయి కాని అదే సమయంలో నన్ను బ్యాడ్ చేస్తాయి. అది కరెక్ట్ కాదంటూ ఫైమా పేర్కొంది. ఆమె మాట‌ల‌ని బ‌ట్టి చూస్తుంటే ఇద్ద‌రి మ‌ధ్య ఏదో పెద్ద గొడ‌వే జ‌రిగి ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది.

Exit mobile version