Needhe Katha Lyrical Song | ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ నుంచి ‘నీదే కథ’ సాంగ్ విడుదల

రష్మిక మందన్నా, దీక్షిత్‌శెట్టి నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమా ప్రమోషన్లలో భాగంగా, ‘నీదే కథ’ అనే శక్తివంతమైన పాటను బుధవారం విడుదల చేశారు. రాకేందు మౌళి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు.

The Girl Friend- Needhe Katha Lyrical Video

విధాత : రష్మిక మందన్నా, దీక్షిత్‌శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమా ప్రమోషన్ లో వేగం పెంచారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుండటంతో మేకర్స్ ప్రచార జోరు పెంచారు. నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ లు ఫ్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించగా..రష్మిక మందన్నా స్పెషల్ వీడియోతో సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరారు.

సినిమా ప్రమోషన్ లో మరో అడుగు ముందుకేస్తూ ‘నీదే కథ’ (అంటూ సాగే పవర్‌ఫుల్‌ గీతాన్ని బుధవారం విడుదల చేశారు. రాకేందు మౌళి రాసిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి పాడారు. హేషమ్‌ అబ్దుల్‌ సంగీతం సమకూర్చారు. చిమ్మ చీకట్లు చీల్చే జేజమ్మై రా…నీవు కోరేటి బాటుంది ముందరా..అంటూ సాగిన పాట హీరోయిన్ పాత్రను ఎలివేట్ చేస్తూ ఆకట్టుకుంది. రష్మిక మందన్నా సోలో పాత్రలో తొలిసారిగా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.