విధాత : రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించగా..రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ను ఆదరించాలని రష్మిక మందన్నా ప్రేక్షకులను కోరారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుండగా..సినిమా ఫ్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను చిత్ర బృందం నిర్వహించింది. అయితే ఈ ప్రెస్ మీట్ కు తాను మరొక సినిమా షూటింగ్ కారణంగా హాజరుకాలేకపోయానంటూ రష్మిక ఓ వీడియో విడుదల చేశారు.
‘‘ది గర్ల్‌ఫ్రెండ్’ నేను నటించిన మొదటి సోలో సినిమా అని.. అందుకే ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం అని వీడియోలో చెప్పుకొచ్చారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా మీ ముందుకు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని.. ఇలాంటి సినిమాలకు ఆదరణ దక్కాలని కోరింది. ఈ చిత్రాన్ని ఇంతమంది సినీ స్టార్స్ సపోర్ట్ చేస్తున్నారంటే కథ ఎంత గొప్పగా ఉందో మీరు అర్థం చేసుకోవాలని.. రాహుల్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని వెల్లడించింది. ప్రేక్షకులు ఈ సినిమాను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానని.. ఇది అందరినీ ఆలోచింపచేసే చిత్రం అని రష్మిక పేర్కొంది. సినిమాలో నటించిన నటినటులు, సాంకేతిక నిపుణుల శ్రమను ఈ సందర్బంగా రష్మిక గుర్తు చేసుకుంది.
ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ రష్మిక తన పాత్రలో జీవించిందని కొనియాడారు. 2021లో ఈ కథ విన్నప్పటి నుంచి నా మైండ్‌లో నుంచి పోలేదని.. దీన్ని ఎప్పుడు సినిమాగా ప్రారంభిస్తారని అడుగుతూనే ఉన్నానని… రాహుల్ లాంటి సున్నితమైన మనస్తత్వం ఉన్నవారే ఇలాంటి కథను తెరకెక్కించగలరన్నారు. ఈ సినిమాతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారన్నారు. ఈ చిత్రం చాలా మందిని మారుస్తుందని చెప్పుకొచ్చారు. 1.5 నుంచి 3.5 రేటింగ్ ఇచ్చేవాళ్లు కూడా దీనికి తక్కువ రేటింగ్ ఇవ్వడానికి ఇబ్బంది పడతారని ధీమా వ్యక్తం చేశారు. నిర్మాతగా కొన్ని సినిమాలతో కోట్లు సంపాదించుకోవచ్చని..ఈ సినిమాతో సంతృప్తి దక్కించుకున్నానన్నారు.
దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ ఈ సినిమా స్క్రిప్ట్ రాసినప్పటి నుంచి అల్లు అరవింద్ సపోర్ట్ చేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన కారణంగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించగలిగామని.. నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదని తెలిపారు. సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు.
‘It is an important film to be told’@iamRashmika at the #TheGirlfriend Pre-release Press Meet
▶️ https://t.co/S5rdVoBMWP#TheGirlfriend in cinemas on November 7th ✨#TheGirlfriendOnNov7th@iamRashmika @Dheekshiths @23_rahulr @ItsAnuEmmanuel @HeshamAWMusic @GeethaArts… pic.twitter.com/x9rkgnjWP8— Geetha Arts (@GeethaArts) November 5, 2025
