Kalki 2898 AD| క‌ల్కి సినిమాలో క‌మ‌ల్ హాస‌న్ పాత్ర నిడివి ఎంత‌.. ఆ స‌మ‌యానికే అన్ని కోట్లు తీసుకున్నాడా..!

Kalki 2898 AD| ఇప్పుడు ఎక్క‌డ చూసిన కూడా ప్ర‌భాస్ న‌టించిన క‌ల్కి మూవీ గురించే చర్చ న‌డుస్తుంది. మూవీని చాలా అద్భుతంగా తెరకెక్కించారంటూ ప్ర‌తి ఒక్క‌రు కూడా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మహాభారత నేపధ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఇండియ‌న్ ప్రేక్ష‌కుల‌నే కాక హాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ని సైతం సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కి గురి చేస్తుంది. ఇందులో ప్ర‌భాస్ భైర‌వ అనే పాత్ర‌లో న‌టించ‌గా, దీపికా సుమ‌తి పాత్ర‌లో, అమితాబ్ బ‌చ్చ‌న్

  • Publish Date - June 30, 2024 / 09:23 PM IST

Kalki 2898 AD| ఇప్పుడు ఎక్క‌డ చూసిన కూడా ప్ర‌భాస్ న‌టించిన క‌ల్కి మూవీ గురించే చర్చ న‌డుస్తుంది. మూవీని చాలా అద్భుతంగా తెరకెక్కించారంటూ ప్ర‌తి ఒక్క‌రు కూడా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మహాభారత నేపధ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఇండియ‌న్ ప్రేక్ష‌కుల‌నే కాక హాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ని సైతం సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కి గురి చేస్తుంది. ఇందులో ప్ర‌భాస్ భైర‌వ అనే పాత్ర‌లో న‌టించ‌గా, దీపికా సుమ‌తి పాత్ర‌లో, అమితాబ్ బ‌చ్చ‌న్ అశ్వ‌థ్థామ పాత్ర‌లో, క‌మ‌ల్ హాస‌న్ యాస్కిన్ అనే పాత్ర‌లో క‌నిపించి మెప్పించారు. ప్ర‌తి ఒక్క‌రి పాత్ర‌కి మంచి మార్కులు ప‌డ్డాయి. అయితే క‌మ‌ల్ హాస‌న్ చిత్రంలో విల‌న్‌గా క‌నిపించ‌గా, ఆయ‌న మూవీలో కనిపించింది కేవలం 7నిమిషాల 4సెకన్లు మాత్ర‌మే.

చిత్రంలో కమల్ హాసన్ వృద్ధుడిగా విల‌న్ పాత్ర‌లో క‌నిపించి మెప్పించారు. అత‌ని పాత్ర పేరు యాస్కిన్ కాగా, ఆయ‌న కేవ‌లం మూడు స‌న్నివేశాల‌లో మాత్ర‌మే క‌నిపిస్తారు. చివ‌రిలో క‌మ‌ల్ హాస‌న్ పాత్ర‌కి సంబంధించిన నిజ‌స్వ‌రూపం తెలిసిపోతుంది. అయితే సినిమా రెండో భాగం కూడా ఉండటంతో అందులో క‌మ‌ల్ త‌న విశ్వ‌రూపం చూపిస్తాడ‌ని క్లైమాక్స్ సీన్స్ తో అర్ధ‌మ‌వుతుంది. మొద‌టి పార్ట్‌లో క‌మ‌ల్ కొన్ని స‌న్నివేశాల‌లో మాత్ర‌మే కనిపించ‌గా, ఆయ‌న త‌న ప‌ర్‌ఫార్మెన్స్‌తో అద‌ర‌గొట్టాడు. రెండో పార్ట్‌లో క‌మ‌ల్ పాత్ర ఆధారంగానే సినిమా క‌థ మొత్తం న‌డుస్తుంద‌ని అర్ధ‌మవుతుంది. అయితే మొదటి పార్ట్ లో ఆయన పాత్ర చిన్నగా, నెగిటివ్ రోల్ గా ఉన్నా కూడా ఆయ‌న దానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం గొప్ప విష‌యం.

కల్కి 2898 ఏడీ చిత్రంలో క‌మ‌ల్ త‌న పాత్ర కోసం ఏకంగా 20 కోట్ల రూపాయ‌ల పారితోషికాన్ని అందుకున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. కేవలం 7నిమిషాల 4సెకన్లు మాత్రమే అత‌ను క‌నిపించ‌గా, ఆ మాత్రం దానికే క‌మ‌ల్ హాస‌న్ అంత పారితోషికాన్ని అందుకున్నాడా అంటూ ప‌లువురు ముచ్చ‌టించుకుంటున్నారు. క‌ల్కి చిత్రం రెండో భాగం షూటింగ్ ఇప్పటికే 60 శాతం పూర్తి కాగా, ఇంక 40 శాతం చిత్రీక‌రణ మిగిలి ఉంది. అయితే నాగ్ అశ్విన్ కమల్ హాసన్ పాత్ర షూటింగ్‌ను కూడా దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా అత‌ని పాత్ర‌కి గాను క‌మ‌ల్ హాస‌న్ 20 కోట్ల పారితోషికం అందుకున్నాడ‌ని ఓ టాక్ న‌డుస్తుంది. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Latest News