Site icon vidhaatha

Hanuman|ఆ వీడియో చూసి క‌న్నీరు పెట్టుకున్న హ‌నుమాన్ డైరెక్ట‌ర్..!

Hanuman| ఇటీవ‌లి కాలంలో విడుద‌లై పెద్ద విజ‌యం సాధించిన చిత్రం హ‌నుమాన్. ఈ మూవీ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంది పెద్ద హిట్‌గా నిలిచింది. అ’ సినిమాతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు హ‌నుమాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్ట‌ర్‌గా మారాడు. ఈ సినిమాని అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించి అద‌ర‌హో అనిపించాడు. చిన్న సినిమాతో 300 కోట్లు కొట్టి, ఈ రోజుల్లో 100 రోజులు ఆడించి అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయేలా చేశాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఇప్పుడు హ‌నుమాన్ సీక్వెల్ కూడా చేయ‌బోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్‌తో కూడా ఓ సినిమా చేయ‌బోతున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌.

అయితే ఇప్పుడు ఆయ‌న చేతిలో పెద్ద లిస్ట్ ఉంద‌ని అర్ధ‌మ‌వుతుంది.ప‌ది సినిమాలు తెర‌కెక్కించే ప్లాన్ చేస్తున్న‌ట్టుగా అర్ధ‌మ‌వుతుంది. అయితే ప్ర‌శాంత్ వ‌ర్మ‌లో చాలా టాలెంట్ ఉంది. ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల‌లో ఆయన ప్ర‌తిభ చూసి అంద‌రం ఆశ్చ‌ర్య‌పోయాం. క్రికెట్ అద్భుతంగా ఆడ‌తాడు. డ్ర‌మ్స్ వాయిస్తాడు.అత‌ను చిన్న‌ప్పుడు సరస్వతి శిశుమందిర్ స్కూల్ లో చదివాడు. అక్కడ చదువుతో పాటు మన ధర్మం, సంస్కృతి.. అన్ని బోధిస్తారు. అందుకే ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాలు కూడా వాటికి ద‌గ్గ‌ర‌గా ఉంటాయి. అయితే ప్ర‌శాంత్ వ‌ర్మ తీసిన హ‌నుమాన్ చిత్రం విడుద‌లై వంద రోజులు అవుతున్నా కూడా ఆ జ్ఞాప‌కాలు వెంటాడుతూనే ఉన్నాయి.

రీసెంట్‌గా ప్ర‌శాంత్ వ‌ర్మ త‌న సోష‌ల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశాడు. అందులో త‌న స్కూల్ చూపిస్తూ పాలకొల్లు శ్రీ సరస్వతి శిశుమందిర్ అని అన్నాడు. నా సినిమా రిలీజ్ ముందు రోజు ఈ వీడియో వ‌చ్చింది. అది చూసి నా కంట్లో క‌న్నీళ్లు వ‌స్తున్నాయి. ఇప్పుడు ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను అని అన్నారు. వీడియోలో తాను చదివిన స్కూల్ ని చూపించి, ఇప్పటి స్టూడెంట్స్ తో హనుమాన్ అని వచ్చేలా గ్రౌండ్ లో కూర్చోబెట్టి, అనంతరం తనకు చదువు చెప్పిన టీచర్లు, ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న టీచర్లు, స్టూడెంట్స్ అందరూ ప్రశాంత్ కి ఆల్ ది బెస్ట్ చెప్ప‌డం మ‌నం చూడ‌వ‌చ్చు. ఈ వీడియో నెటిజ‌న్స్‌ని కూడా ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

Exit mobile version