Hema| ఎట్ట‌కేల‌కి పోలీసుల‌కి చిక్కిన హేమ‌… కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నారా..!

Hema| బెంగ‌ళూరు రేవ్ పార్టీ కేసులో న‌టి హేమ పేరు బ‌య‌ట‌కు రాగా, ఆమె ఆ పార్టీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేదంటూ తేల్చి చెప్పింది. తాను హైద‌రాబాద్‌లో ఉన్నాన‌ని ఒక‌సారి, చికెన్ బిర్యానీ చేసుకుంటున్నానని మ‌రో సారి చెప్పుకొచ్చింది. అయితే పోలీసులు హేమ‌ని రెడ్ హ్యాండెడ్‌గా

  • Publish Date - June 3, 2024 / 06:37 PM IST

Hema| బెంగ‌ళూరు రేవ్ పార్టీ కేసులో న‌టి హేమ పేరు బ‌య‌ట‌కు రాగా, ఆమె ఆ పార్టీతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేదంటూ తేల్చి చెప్పింది. తాను హైద‌రాబాద్‌లో ఉన్నాన‌ని ఒక‌సారి, చికెన్ బిర్యానీ చేసుకుంటున్నానని మ‌రో సారి చెప్పుకొచ్చింది. అయితే పోలీసులు హేమ‌ని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకొని ఫొటో కూడా విడుద‌ల చేశారు.ఆ త‌ర్వాత నటి హేమ, రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కి పంపించారు బెంగుళూరు పోలీసులు. అయితే హేమ‌కి పాజిటివ్ నిర్ధారణ కావ‌డంతో నోటీసులు పంపారు.. జూన్ 1 న హాజరు అవుతానంటూ హేమ తెలియ‌జేసింది. కాని ఆమె హాజరు కాకపోవటంతో, బెంగుళూరు పోలీసులు హేమని ఈరోజు అరెస్ట్ చేశారు.

బెంగళూరు సీసీబీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రేపు ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు. రక్త నమూనాలో డ్రగ్స్ పాజిటివ్ రావ‌డంతో విచారణకు రావాలని ఆమెకు సీసీబీ పోలీసులు మూడుసార్లు నోటీసులు ఇచ్చారు. రెండుసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆమె హాజరుకాలేదు. మూడోసారి నోటీసుతో విచారణకు హాజరయ్యారు.ఉదయం నుంచి ఆమెను సీసీబీ పోలీసులు విచారించి ఆ త‌ర్వాత ఆమెని అరెస్ట్ చేశారు. హేమతో పాటు మొత్తం 86 మందికి, అందులోనూ తెలుగు వారందరికీ పాజిటివ్ వచ్చింది.

పాజిటివ్ వచ్చిన వారందరికీ నోటీసులు ఇవ్వడం.. విచారణకు హాజరుకావాలని ఆదేశించ‌డం జ‌రుగుతుంది. ఆ సమయంలో తనకు వైరల్ ఫీవర్ వచ్చిందని.. విచారణకు హాజరుకాలేనని కొద్దిరోజులు సయం కావాలని హేమ ఏవో క‌ట్టు క‌థ‌లు అల్లిన కూడా ఉప‌యోగం లేకుండా పోయింది. ఎట్ట‌కేల‌కి ఆమెని అరెస్ట్ చేసి క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. కోర్టులో ఏం జ‌రుగుతుంది, హేమ విష‌యంలో ఎలాంటి ఫ‌లితాలు బ‌య‌ట‌కి వ‌స్తాయ‌ని అందరు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. హేమ ఈ కేసు నుండి బ‌య‌టప‌డేందుకు రాజ‌కీయ ప్ర‌ముఖుల సాయం కూడా తీసుకుంద‌నే టాక్ న‌డిచింది

Latest News