Wife Murder | లక్నో : ఓ భర్త( Husband ) దారుణానికి పాల్పడ్డాడు. తన భార్య( Wife )పై అనుమానంతో ఆమెను అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత తమ బెడ్( Bed ) కిందనే పాతిపెట్టాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్( Uttar Pradesh )లోని బహ్రెచ్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని నర్పత్‌పుర్వా పరిధిలోని అహత గ్రామానికి చెందిన హరికిషన్‌కు ఫూల దేవీ(45)తో కొన్నేండ్ల క్రితం పెళ్లైంది. ఉపాధి నిమిత్తం భర్త హరికిషన్ హర్యానాకు వెళ్లాడు. అక్కడే కూలీ పనులు చేసుకుంటూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు.
అయితే ఈ ఏడాది అక్టోబర్ 6వ తేదీన ఫూల దేవీ అదృశ్యమైంది. దీంతో ఆమె సోదరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్టోబర్ 13వ తేదీన పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. కానీ ఆమె ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో దేవీ సోదరుడు ఒకరు హరికిషన్ ఇంటికి గత శుక్రవారం చేరుకున్నాడు. ఆ ఇంటిని నిశితంగా పరిశీలించాడు. అయితే హరికిషన్, ఫూల దేవీ బెడ్ కింద మట్టిని తవ్విన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు అక్కడికి చేరుకుని మట్టిని తవ్వగా ఫూలదేవీ మృతదేహం లభ్యమైంది. ఐదు నుంచి ఆరు అడుగుల లోతు తవ్వి భార్య మృతదేహాన్ని భర్త పూడ్చిపెట్టాడు. హరికిషన్‌ను పోలీసులు మంగళవారం యూపీలోని బారాబంకి జిల్లాలోని తాపేసి గ్రామంలో అరెస్టు చేశారు.
తన భార్య అక్రమ సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో హరికిషన్ అంగీకరించాడు. గ్రామానికి చెందిన మరో వ్యక్తితో తన భార్య సన్నిహితంగా ఉండగా తాను చూశానని, అందుకే హత్య చేశానని తెలిపాడు. ఈ కేసులో హరికిషన్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా, రిమాండ్ విధించింది.