విధాత : కృషితో నాస్తి దుర్భిక్షం అనడానికి నిదర్శనంగా ఓ రైతు ప్రకృతి సేధ్యంతో సాధించిన విజయాలు ఇప్పుడు దేశం అంతా ఆకర్షిస్తున్నాయి. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం, అత్తోట గ్రామానికి చెందిన 82 ఏళ్ల రైతు రోశయ్య సక్సెస్ స్టోరీ రైతాంగానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. రోశయ్య ప్రకృతి సేద్యంతో కేవలం 75 సెంట్ల భూమిలో 52 రకాల పంటలు పండిస్తూ నెలకు రూ.20 వేలకు పైగా ఆర్జిస్తున్న తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటుంది. ప్రకృతి సేధ్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న రైతు రోశయ్య విజయగాధ తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ రైతుకు అభినందనలు చెబుతూ ఎక్స్ లో వీడియో పోస్ట్ చేయడం వైరల్ గా మారింది.
భూమిని తల్లిలా భావించి… ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం, అత్తోట గ్రామ రైతు రోశయ్యకి నా ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఎనభై ఏళ్ల వయసులో కేవలం 75 సెంట్ల భూమిలో 52 రకాల పంటలు పండిస్తూ… నెలకు రూ.20 వేలకు పైగా ఆర్జిస్తున్న రోశయ్య గారి విజయగాధ స్ఫూర్తిదాయకం. 2016లో ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి నాడు తీసుకున్న చర్యలతో ప్రేరణ పొంది ప్రకృతి సాగు మొదలు పెట్టిన రోశయ్య సాధిస్తున్న విజయాలు ఆదర్శం. రోశయ్యకి హృదయపూర్వక అభినందనలు అంటూ తన పోస్టులో పేర్కొన్నారు.
భూమిని తల్లిలా భావించి… ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న గుంటూరు జిల్లా, కొల్లిపర మండలం, అత్తోట గ్రామ రైతు రోశయ్య గారికి నా ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఎనభై ఏళ్ల వయసులో కేవలం 75 సెంట్ల భూమిలో 52 రకాల పంటలు పండిస్తూ… నెలకు రూ.20 వేలకు పైగా ఆర్జిస్తున్న రోశయ్య గారి… pic.twitter.com/599WBEC6Gq
— N Chandrababu Naidu (@ncbn) March 13, 2026
ఇవి కూడా చదవండి :
గ్యాస్ కొరత పరిష్కరానికి మానిటరింగ్ కమిటీలు : మంత్రి ఉత్తమ్
తెలుగు రాష్ట్రాల రైల్వేప్రయాణీకులకు కేంద్రం గుడ్‌న్యూస్
